45 Official Trailer
45 Official Trailer : కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మాణంలో అర్జున్ జన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘45 ‘. ఫేస్ ది ఫియర్ అనేది ట్యాగ్ లైన్ . ఈ సినిమాలో ముగ్గురు కన్నడ స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు.(45 Official Trailer)
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాని జనవరి 1న గ్రాండ్‌గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘45 ’ ట్రైలర్ చూస్తే.. రెండు కాలాల మధ్య ఈ కథ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఓ వైపు యుద్ధం, మరో వైపు కామెడీతో సరికొత్తగా ముగ్గురు హీరోలు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తూ మెప్పించారు. చివర్లో శివన్న లేడీ గెటప్ కూడా వేయడం గమనార్హం.
Also Read : AA22xA6 : అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగే..
మీరు కూడా 45 ది మూవీ ట్రైలర్ చూసేయండి..