AA22xA6 : అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగే..
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (AA22xA6)
AA22xA6
AA22xA6 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథతో భారీగా పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో నలుగురు హీరోయిన్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారని సమాచారం.(AA22xA6)
తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అదిరిపోయే అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందట. యాక్షన్ తో పాటు కొన్ని సీన్స్ అండర్ వాటర్ లో ఉన్నాయట. అల్లు అర్జున్ కూడా ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ ని చేయనున్నారు. హాలీవుడ్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ ఆధ్వర్యంలో ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారట. విజువల్ పరంగా ఓ రేంజ్ లో ఉండబోతుందని మూవీ టీమ్ మీడియాకు సమాచారం అందించారు.
Also Read : Rajasaab : వామ్మో.. రాజాసాబ్ సినిమా లెంగ్త్ ఎంతో తెలుసా.. షూటింగ్ ఫుటేజ్ అయితే మరీ దారుణం..
దీంతో బన్నీ వాటర్ లో ఫైట్స్ చేస్తాడని తెలుస్తుంది. ఈ అప్డేట్ తో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2027 లోనే వస్తుందని టాక్.
