Shivathmika Rajashekar : ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ లో శివాత్మిక.. లీక్ చేసిన నటి.. ఫోటో వైరల్..
ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ థాయిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. (Shivathmika Rajashekar)
- Saketh U
- Published on- April 27, 2026 / 07:14 AM IST
Shivathmika Rajashekar
Shivathmika Rajashekar : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా అదరగొట్టింది. దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. ఈNఈ 2 అనే టైటిల్ తో సీక్వెల్ ప్రకటించి షూటింగ్ కూడా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ థాయిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తరుణ్ భాస్కర్, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమఠం సీక్వెల్ లో కూడా కంటిన్యూ అవ్వగా సాయి సుశాంత్ బదులు విశ్వనాధ్ మాగంటి నటిస్తున్నారు. పార్ట్ 1 లో ఓ చిన్న పాత్రలో మెరిపించిన నటి అనీషా అంబ్రోస్ ఈ సీక్వెల్ లో కూడా నటిస్తుంది.
Also Read : Mehreen Pirzada : ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేతో ఎంగేజ్మెంట్.. ఇప్పుడు వేరేవ్యక్తితో హీరోయిన్ మెహరీన్ పెళ్లి..
తాజాగా అనీషా అంబ్రోస్ షేర్ చేసిన ఫొటోతో ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. అనీషా అంబ్రోస్, శివాత్మిక, వెంకటేష్ కాకుమాను ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అనిషా. ఈ ఫొటోలో విశ్వక్ ఉన్నాడు కానీ ఫేస్ కనిపించకుండా పడుకున్నాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. శివాత్మిక కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో థాయిలాండ్ బ్యాక్ డ్రాప్ విజువల్స్ తో ఫోటో షేర్ చేసింది.
అనీషా లీక్ చేసిన ఫొటోతో శివాత్మిక ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ లీక్ తో శివాత్మిక వైరల్ అవుతుంది. మరి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో శివాత్మిక ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Manasa Varanasi : రీసెంట్ గా హిట్ కొట్టిన మాజీ మిస్ ఇండియా.. మానస వారణాసి క్యూట్ ఫొటోలు..
