Actor Tiger Shroff : నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు.. ముంబైలో అసలేం జరిగింది?

Actor Tiger Shroff : ముంబైలో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు కలకలం రేపాయి. నటుడు సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ గాయపడ్డాడు. 12 పోలీసు బృందాలతో దర్యాప్తు, గ్యాంగ్‌స్టర్ల పేరుతో సోషల్ మీడియా పోస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది.

Shots Fired At Tiger Shroff

  • టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం
  • బాలీవుడ్‌లో బిగ్ షాక్.. టైగర్ ష్రాఫ్ కారుపై మూడు రౌండ్ల ఫైరింగ్
  • ఫుట్‌బాల్ ఆడి వస్తుండగా కాల్పులు.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

Actor Tiger Shroff : బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌కు పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని జుహు ప్రాంతం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ గాయపడ్డాడు. దీంతో బాలీవుడ్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

ఫుట్‌బాల్ ఆడి వస్తుండగా దాడి :
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆదివారం ఫుట్‌బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా టైగర్ ష్రాఫ్ కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై 3 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం.. ఈ అనూహ్య ఘటనతో అక్కడి ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

అయితే, అదృష్టవశాత్తూ టైగర్ ష్రాఫ్‌కు కాల్పుల్లో ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన క్షేమంగా ఉన్నట్లు తండ్రి జాకీ ష్రాఫ్ బృందం ధృవీకరించింది. మరోవైపు, గాయపడిన డ్రైవర్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also : Amazon Sale 2026 : రూ.60 వేలలోపు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ డీల్స్.. వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లపై భారీ తగ్గింపులు!

12 పోలీసు బృందాలతో వేట :
ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాల్పులకు అసలు కారణమేంటి? నటుడు ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

గ్యాంగ్‌స్టర్ల పేరుతో సంచలన పోస్ట్ :
ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ అనిల్ పండిట్, హర్మన్ సంధు అనే వ్యక్తులు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ వాదనను అధికారులు ధృవీకరించలేదు.

ఘటన అనంతరం మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్, ష్రాఫ్ కుటుంబంతో మాట్లాడినట్లు సమాచారం.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ సురక్షితంగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కాల్పుల వెనుక అసలు కుట్ర ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.