Shravan Reddy : నగ్నంగా నటించి.. నెగిటివ్ షేడ్స్, డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడుగా..

ఈ సినిమాలో నటుడు శ్రవణ్ రెడ్డి కీలక పాత్రలో నటించాడు.(Shravan Reddy)

  • Published on- August 18, 2026 / 02:35 PM IST

Shravan Reddy

Shravan Reddy : కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా ఇటీవల వచ్చిన సినిమా ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో సీనియర్ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హారర్ మిస్టిక్ డివోషనల్ థ్రిల్లర్ గా ఈ అగధ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నటుడు శ్రవణ్ రెడ్డి కీలక పాత్రలో నటించాడు.

శ్రవణ్ రెడ్డి పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో మంచిగా, మరో పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. దుష్ట ఆత్మలు, అగధ ఆవహిస్తే ఏం చేస్తాడు అని తన నటనతో భయపెట్టాడు కూడా కొన్ని సీన్స్ లో. శ్రవణ్ రెడ్డి పాత్ర ఇచ్చే రెండు ట్విస్టులు కూడా మెప్పిస్తాయి. కొన్ని సీన్స్ లో తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో కూడా మెప్పిస్తాడు. ఓ సీన్ లో నగ్నంగా కూడా నటించాడు. సినిమా కోసం నగ్నంగా నటించడం మాములు విషయం కాదు. శ్రవణ్ రెడ్డి చాలా డేర్ చేసి ఈ అగాధ సినిమాలో పాత్రని పోషించాడు. ఈ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. అందులో కూడా శ్రవణ్ రెడ్డి ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Also Read : Ajay Arasada : పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్..

గతంలో డర్టీ హరి అనే సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించిన శ్రవణ్ రెడ్డి ఈ అగాధ సినిమాలో నెగిటివ్ షేడ్స్ తో చాలా బాగా నటించాడు. అగధ సినిమాతో ఈ నటుడికి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.