Mohabbat : జెన్ జీ ప్రేమకథ ‘మొహబ్బత్’.. సినిమా ఓపెనింగ్ & ఫస్ట్ లుక్ లాంచ్..
ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నేడు జరిగింది. (Mohabbat)
- Saketh U
- Published on- June 5, 2026 / 08:38 PM IST
Mohabbat
Mohabbat : సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మొహబ్బత్. ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై అఫ్రోజ్ షేక్ నిర్మాణంలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ మొహబ్బత్ సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసారు.
అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. అఫ్రోజ్ అన్న నిర్మాతగా కొత్త వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. మొహబ్బత్ సినిమాకు పని చేస్తున్న అందరికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు. డైరెక్టర్ సలీమ్ మాలిక్ మాట్లాడుతూ.. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ సినిమాగా మొహబ్బత్ రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది అని అన్నారు.
Also Read : Buchibabu Sana : బుచ్చిబాబుది ఎంత మంచి మనసో.. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో..
నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ.. నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై మొదటి సినిమాగా మొహబ్బత్ నిర్మిస్తున్నాను అని తెలిపారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.
