Shruti Haasan: వంటల వీడియోలు, క్రింజ్ రీల్స్.. తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన శృతి
తండ్రి కమల్ హాసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతి హాసన్(Shruti Haasan).
- V Santhosh Kumar
- Published On : March 24, 2026 / 06:02 PM IST
Shruti Haasan interesting comments about her father Kamal Haasan
- తండ్రిపై శృతి ఆసక్తికర కామెంట్స్
- ఆయనకు వంటల వీడియోలు అంటే ఇష్టం అంటూ కామెంట్స్
- సినిమాల గురించి అస్సలే మాట్లాడుకోరట
Shruti Haasan: స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వెండితెరపై, బయట ఆయనకున్న స్టార్డమ్ భిన్నంగా, నిజ జీవితంలో వారిద్దరూ ఎంతో సాధారణంగా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతి, కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరిలో తాను గమనించిన ఒక గొప్ప లక్షణాన్ని గురించి వివరించారు.
Anita Hassanandani: నువ్వు నేను ఫేమ్ అనిత.. స్విమ్ సూట్ లో రచ్చ లేపిందిగా.. ఫొటోలు
వృత్తిపరమైన సలహాల కోసం తాను ఎప్పుడూ వారి దగ్గరకు వెళ్లలేదని, కేవలం వారిని గమనించడం ద్వారానే చాలా నేర్చుకున్నానని శ్రుతి(Shruti Haasan) చెప్పారు. కమల్, రజనీ.. ఇద్దరూ ఎంతో కష్టపడతారని, పని పట్ల వారికున్న క్రమశిక్షణ అమోఘమని తెలిపారు. ఎంత ఒత్తిడి ఉన్నా బయటపడకుండా, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే పని పట్ల రాక్షసుల్లా శ్రమిస్తారని, ఆ లక్షణం తనకు ఎంతో ఇష్టమని అన్నారు.
ఇంకా, తండ్రి కమల్ హాసన్ తో తనకున్న బంధం గురించి ఆమె మాట్లాడుతూ, తామిద్దరం పని గురించి కాకుండా సాధారణ విషయాలనే ఎక్కువగా మాట్లాడుకుంటామన్నారు. “మేము మామూలు తండ్రీకూతుళ్లలాగే ఉంటాము. నాన్న నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా క్రింజ్ రీల్స్ పంపిస్తుంటారు. కొన్నిసార్లు అవి వింతగా ఉంటే, ‘నాన్న.. ఇది అస్సలు బాలేదు’ అని ఆటపట్టిస్తుంటాను. అలాగే ఆయనకు వంటల వీడియోలు, సంగీతం, కళాత్మకమైన వీడియోలంటే చాలా ఇష్టం” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
