Siddhant Chaturvedi
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే దో దీవానా సహర్ మే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. సిద్దాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగా పండింది.
సిద్దాంత్ – మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అయితే వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహాలు వచ్చాయి. కానీ అదంతా సినిమా ప్రమోషన్స్ కి అని తెలిపారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్, సిద్దాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Deepthi Ganta : నాని బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసిన నాని అక్క..
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. నేను ఎక్కువ రొమాంటిక్, కామెడీ, లవ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ఈ ఏజ్ లో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రొమాంటిక్ సినిమాలు చేస్తాను అని అంది. దీంతో వెంటనే హీరో సిద్దాంత్ చతుర్వేది.. 60 ఏళ్ళ వయసులో కూడా నేను నీతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడతాను అని అన్నాడు.
మృణాల్ కూడా 60 ఏళ్ళ వయసులో కూడా బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు చెప్పొచ్చు అని కామెంట్ చేసింది. దీంతో సిద్దాంత్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూతో మృణాల్ మరిన్ని లవ్ రొమాంటిక్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుందని తెలుస్తుంది.
Also Read : Vijay Rashmika : కోడలు విషయంలో విజయ్ తల్లి కోరిక ఇదే.. రష్మిక తీరుస్తుందా..
Actress #MrunalThakur :
“I’m trying to stick more to Rom Com or the romantic movies because if not now, then When will I do romantic movies?”#SiddhantChaturvedi :
“I would ROMANCE even in your 60s.” pic.twitter.com/bbzHSfcIDy
— Whynot Cinemas (@whynotcinemass_) February 23, 2026