×
Ad

Takkar Twitter Review : టక్కర్ ట్విట్టర్ రివ్యూ.. ఇది కూడా పోయినట్టేనా? సిద్ధార్థ్ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడు?

సిద్ధార్థ్, దివ్యంశా కౌశిక్(Divyansha Kaushik) జంటగా నటించిన టక్కర్ సినిమా నేడు జూన్ 9న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

  • Published On : June 9, 2023 / 09:13 AM IST

Siddharth Takkar Movie Twitter Review and audience rating

Takkar Twitter Review :  సిద్ధార్థ్(Siddharth) ఇటీవల చాలా గ్యాప్ తీసుకుంటూ సినిమాలు తీస్తున్నాడు. తాజాగా టక్కర్(Takkar) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సిద్ధార్థ్, దివ్యంశా కౌశిక్(Divyansha Kaushik) జంటగా నటించిన టక్కర్ సినిమా నేడు జూన్ 9న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. ఇటీవల టక్కర్ సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గా చేశారు. సిద్ధార్థ్ ముందుండి మరీ టక్కర్ సినిమాను భారీగా ప్రమోట్ చేశాడు. టక్కర్ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతోంది.

Tobe Nwigwe : RRR, నాటు నాటు సాంగ్‌ని పొగిడిన ప్రముఖ హాలీవుడ్ ర్యాపర్, ట్రాన్స్ఫార్మర్స్ నటుడు..

ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. తమిళ్, తెలుగులో కూడా కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చుసిన అభిమానులు, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొంతమంది పర్లేదు కమర్షియల్ సినిమా అంటుంటే, చాలా మంది రొటీన్, బోరింగ్ సినిమా అని కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధార్థ్ కంబ్యాక్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.