×
Ad

Tillu Square : 100 కోట్ల ‘టిల్లు స్క్వేర్’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?

టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజయి ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

  • Published On : April 17, 2024 / 07:50 AM IST

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie OTT Update

Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమా వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజయి ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాకి భారీ ప్రాఫిట్స్ వచ్చాయి. టిల్లు స్క్వేర్ సినిమా నవ్విస్తునే ట్విస్టులతో ప్రేక్షకులని మెప్పించింది.

ఇటీవల ఎంత సూపర్ హిట్ అయిన సినిమాలైనా నెల రోజుల్లో ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా కూడా ఓటీటీ బాట పట్టనుంది. టిల్లు స్క్వేర్ సినిమా ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ కూడా దాదాపు 18 కోట్లు ఇచ్చి టిల్లు స్క్వేర్ సినిమా కొనుక్కుంది. దీంతో అటు థియేట్రికల్ గా ఇటు డిజిటల్ గా కూడా టిల్లు స్క్వేర్ ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది.

Also Read : Geethanjali Malli Vachindhi : ‘గీతాంజలి’ మెట్రో ట్రైన్ ఎక్కింది.. ఇది వేరే లెవల్ ప్రమోషన్స్..

ఇప్పటికి టిల్లు స్క్వేర్ సినిమా కొన్ని థియేటర్స్ లో నడుస్తుంది. ఓటీటీలో చూడాలనుకునే వాళ్ళు ఇంకో పది రోజులు ఆగితే ఫ్యామిలీ అంతా కలిసి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో టిల్లు స్క్వేర్ సినిమా చూసి ఎంజాయ్ చేసేయొచ్చు.