Geethanjali Malli Vachindhi : ‘గీతాంజలి’ మెట్రో ట్రైన్ ఎక్కింది.. ఇది వేరే లెవల్ ప్రమోషన్స్..
గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.

Geethanjali Malli Vachindhi Movie Team Promotions in Metro Train
Geethanjali Malli Vachindhi : పదేళ్ల క్రితం అంజలి(Anjali) డ్యూయల్ రోల్ లో వచ్చిన హారర్ కామెడీ ‘గీతాంజలి’ సినిమాకి ఇటీవల సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజయి సందడి చేస్తుంది. శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, సునీల్, సత్య, అలీ.. పలువురు నటీనటులతో సినిమా హిలేరియస్ గా నవ్వించారు. అక్కడక్కడా భయపెడుతూనే ఫుల్ గా నవ్వించారు.
ఇక ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. ఇటీవల అన్ని సినిమాలు పోటీ పడి మరీ ప్రమోషన్స్ చేస్తున్నాయి. కొత్త రకం ప్రమోషన్స్ తో జనాల మధ్యలోకి వెళ్తున్నాయి సినిమాలు. తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా షకలక శంకర్, అంజలి, సత్యశ్రీ, పవిత్ర, కోన వెంకట్.. మరికొంతమంది సినిమా యూనిట్ మెట్రో ఎక్కి ప్రమోషన్స్ చేశారు.
Also Read : Sai Pallavi : కాలేజీ ఫెస్ట్‌లో అల్లు అర్జున్ పాటకి సాయి పల్లవి డాన్స్.. రింగ రింగ వీడియో చూశారా..
సినిమా యునిట్ అంతా సినిమాలో చూపించిన గీతాంజలి ఆత్మ ఉండే బొమ్మని పట్టుకొని మెట్రో ఎక్కి ప్రయాణికుల్ని భయపెడుతూనే నవ్వించారు. ప్రయాణికులతో మాట్లాడి, ఫోటోలు దిగారు. మా సినిమాను థియేటర్స్ లో చూడండి అంటూ ఫ్లకార్డులు పట్టుకొని తిరిగారు. మెట్రో స్టేషన్స్ లో దిగి ప్రయాణికులతో సందడి చేసారు. దీంతో స్టేషన్ లో ప్రయాణికులు అంతా గీతాంజలి మళ్ళీ వచ్చింది టీంతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఇటీవల పలువురు మెట్రోలో ప్రమోషన్స్ చేసినా ఇలా సినిమాలోని బొమ్మ పట్టుకెళ్లి భయపెడుతూ, నవ్విస్తూ కొత్తగా ప్రమోట్ చేసారు మూవీ టీం.