Sai Pallavi : కాలేజీ ఫెస్ట్‌లో అల్లు అర్జున్ పాటకి సాయి పల్లవి డాన్స్.. రింగ రింగ వీడియో చూశారా..

కాలేజీ ఫెస్ట్‌లో అల్లు అర్జున్ రింగ రింగ పాటకి సాయి పల్లవి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Sai Pallavi : కాలేజీ ఫెస్ట్‌లో అల్లు అర్జున్ పాటకి సాయి పల్లవి డాన్స్.. రింగ రింగ వీడియో చూశారా..

Sai Pallavi dance to Sheila Ki Jawani ringa ringa at her college fest videos

Updated On : April 16, 2024 / 6:57 PM IST

Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయి పల్లవి తన కెరీర్ ని డాన్స్ షోలో డాన్సర్ గానే స్టార్ట్ చేసారు. తెలుగు డాన్స్ షో ఢీలో కంటెస్టెంట్ గా పోటీ చేసిన పల్లవి.. ఆ తరువాత నటిగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. ఇక డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ నటి సినిమాల్లో అదిరిపోయే డాన్స్ వేస్తూ ఆడియన్స్ నుంచి విజుల్స్ అందుకుంటూ ఉంటారు.

ఢీ డాన్స్ షోలో, సినిమాల్లో సాయి పల్లవి వేసిన డాన్స్ ని అందరూ చూసే ఉంటారు. కానీ ఆమె చదువుకుంటున్న సమయంలో స్టేజి పై వేసిన డాన్స్ ఎవరైనా చూశారా..? అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాలేజీ ఫెస్ట్ లో అల్లు అర్జున్ పాటకి సాయి పల్లవి వేసిన డాన్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆర్య 2లోని ఐటెం సాంగ్ ‘రింగ రింగ’కి సాయి పల్లవి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు. అలాగే బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ‘షీలాకి జవానీ’ పాటకి కూడా పల్లవి డాన్స్ వేసింది. మరి ఆ రెండు డాన్స్ వీడియోలు వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Also read : The Raja Saab : ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మొదటి సాంగ్ రాబోతుంది..

కాగా సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేస్తున్నారు. తెలుగులో నాగచైతన్యతో ‘తండేల్’ సినిమా చేస్తున్నారు. ఇక తమిళంలో శివ కార్తికేయన్ తో ‘అమరన్’ చేస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు. ఒక ఆమిర్ ఖాన్ కొడుకు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. మరొకటి రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణంలో సీతగా కనిపించబోతున్నారు.