The Raja Saab : ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మొదటి సాంగ్ రాబోతుంది..
ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత. మొదటి సాంగ్ రిలీజ్ చేయడానికి దర్శకుడు మారుతీ..

Prabhas The Raja Saab movie first song release update
The Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి ఓ హారర్ కామెడీ జోనర్ లో చేస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. మారుతీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడో సైలెంట్ గా షూటింగ్ స్టార్ చేసుకొని చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి.. వింటేజ్ డార్లింగ్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసారు. దీంతో ఈ మూవీ అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఆ అప్డేట్ తరువాత మళ్ళీ మరో అప్డేట్ లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ని ఇవ్వడం కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ ముసిచల్ ప్రమోషన్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారట. సినిమాలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత SKN ఇన్‌డైరెక్ట్ గా ట్వీట్ చేసారు. ఇక ఈ ట్వీట్ కి మారుతీ స్మైల్ సింబల్ తో రిప్లై ఇవ్వడంతో.. అది రాజాసాబ్ ఫస్ట్ సింగల్ అప్డేట్ అని అర్ధమవుతుంది.
Also read : Dwarakish : ప్రముఖ నటుడు మరణం.. స్నేహితుడిని కోల్పోయానంటూ రజినీకాంత్ విచారం..
😉
— Director Maruthi (@DirectorMaruthi) April 16, 2024
మరి ఈ అప్డేట్ ని రేపు శ్రీరామనవమి సందర్భంగా ఇవ్వబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ అప్డేట్ తో ప్రభాస్ అభిమానులు సరికొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని సమాచారం.