Dwarakish : ప్రముఖ నటుడు మరణం.. స్నేహితుడిని కోల్పోయానంటూ రజినీకాంత్ విచారం..

ప్రముఖ కన్నడ నటుడు 'ద్వారకీష్' మరణం. స్నేహితుడిని కోల్పోయానంటూ రజినీకాంత్ ట్వీట్.

Dwarakish : ప్రముఖ నటుడు మరణం.. స్నేహితుడిని కోల్పోయానంటూ రజినీకాంత్ విచారం..

Rajinikanth condolences on Kannada actor Dwarakish demise

Dwarakish : ప్రముఖ కన్నడ నటుడు ‘ద్వారకీష్’.. 81ఏళ్లు నేడు (ఏప్రిల్ 16) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతోనే ఆయన మరణించినట్లు సమాచారం. బెంగళూరులోని తన ఇంటిలోనే ద్వారకీష్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమని తీవ్రగా భాదిస్తుంది. దీంతో ద్వారకీష్ అకాలమరణం పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే రజినీకాంత్ కూడా ద్వారకీష్ కి నివాళులు అర్పిస్తూ పోస్ట్ వేశారు. “నా చిరకాల మిత్రుడు ద్వారకీష్ ని కోల్పోవడం నాకు ఎంతో బాధని కలిగిస్తుంది. తనతోనే ఎన్నో జ్ఞాపకాలు నా ఆలోచనలోకి వస్తున్నాయి. ఒక కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ద్వారకీష్.. పెద్ద నిర్మాతగా, దర్శకుడిగా ఎదుగుతూ వెళ్ళాడు. అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతుని తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేసారు.

Also read : Vishal : ఉద‌య‌నిధి vs విశాల్.. తమిళ్ సినిమాల్లో రాజకీయాల వేడి..!

అలాగే భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా ద్వారకీష్‌ను మరణం పట్ల ట్వీట్ చేసారు. “కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ద్వారకీష్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాము. సినిమా ప్రపంచానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అంటూ రాసుకొచ్చారు.

కాగా ద్వారకీష్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అప్పుల సమస్యతోనే ద్వారకీష్.. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్‌లోని ఉన్న తన ఇంటిని కూడా అమ్మేసినట్లు సమాచారం. ద్వారకీష్ చివరిగా 2019 లో శివరాజ్ కుమార్ నటించిన ‘ఆయుష్మాన్ భవ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేక భారీ నష్టాలు కలిగించింది. ఆ తరువాత నుంచి మళ్ళీ మరో సినిమాని నిర్మించలేదు.