Vishal : ఉద‌య‌నిధి vs విశాల్.. తమిళ్ సినిమాల్లో రాజకీయాల వేడి..!

డీఎంకే పార్టీ లీడర్ ఉదయనిధి స్టాలిన్ పై విశాల్ ఇన్‌డైరెక్ట్ గా విమర్శలు చేసారు. విశాల్ నటించిన కొత్త సినిమా 'రత్నం' మూవీ ప్రమోషన్స్‌లో..

Vishal : ఉద‌య‌నిధి vs విశాల్.. తమిళ్ సినిమాల్లో రాజకీయాల వేడి..!

Vishal viral comments on Udhayanidhi Stalin in Rathnam movie promotions

Vishal : తమిళనాడులో సినిమా మరియు రాజకీయాలు మధ్య ఎప్పుడూ వివాదాలు కనిపిస్తూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఒకరి ఒకరు విమర్శలు చేసుకుంటూనే కనిపిస్తారు. తాజాగా హీరో విశాల్.. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే పార్టీ లీడర్ ఉదయనిధి స్టాలిన్ పై ఇన్‌డైరెక్ట్ గా విమర్శలు చేసారు. విశాల్ నటించిన కొత్త సినిమా ‘రత్నం’ రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించిన ‘రెడ్ జెయింట్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ పై మండిపడ్డారు. తాము వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి సినిమాలు చేసి, వాటిని రిలీజ్ చేయడానికి చూస్తుంటే.. ఆ సినిమాని పలానా టైంలోనే రిలీజ్ చేయాలి, ఇన్ని రోజులే థియేటర్స్ ఆడించాలి అని ఎవరో ఒక వ్యక్తి ఏసీ రూంలో కూర్చొని కంట్రోల్ చేస్తున్నాడు.

అలా కంట్రోల్ చేయడానికి అసలు వాళ్ళు ఎవరు..? వాళ్ళకి ఆ అధికారం ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. విశాల్ గత సినిమాలు ఎనిమీ అండ్ మార్క్ ఆంటోనీ రిలీజ్ సమయంలో రెడ్ జెయింట్ పిక్చర్స్ సంస్థ ఇబ్బందులకు గురి చేసినట్లు విశాల్ పేర్కొన్నారు. థియేటర్ల కొరత ఏర్పడేలా ఆ సినిమాల సమయంలో రెడ్ జెయింట్ పిక్చర్స్ ప్రవర్తించినట్లు వెల్లడించారు. ఇప్పుడు రత్నం మూవీకి కూడా అలాగే చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ అసహనం వ్యక్తం చేసారు.

Also read : Telugu – Tamil Movies : అటు తమిళ్.. ఇటు తెలుగు సూపర్ స్టార్స్.. 2024 సెకండ్ హాఫ్‌లో..

కాగా ఈ విషయం పై తమిళ్ నిర్మాతలు, పలువురు స్టార్ మాట్లాడానికి బయటపడుతున్న సమయంలో విశాల్.. ఇలా ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. అయితే విశాల్ ఇలా ప్రశ్నించడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల దళపతి విజయ్ ని విశాల్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్ తరువాత విశాల్ మద్దతు విజయ్ కి ఉండబోతుందని వార్తలు వచ్చాయి.

అంతేకాదు విజయ్ పార్టీ నుంచి విశాల్ పోటీ చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే విశాల్ ఇప్పటినుంచే స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా కాంపెయిన్ చేయడానికి సిద్ధమవుతున్నారని నెట్టింట పలువురు తమ అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. మరి విశాల్ నిజంగానే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కామెంట్స్ చేసారా..? లేదా సినిమా పరిశ్రమలోని సమస్యలను ప్రశ్నిస్తూనే మాట్లాడారా..? అనేది తెలియాలి.