The Raja Saab : ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మొదటి సాంగ్ రాబోతుంది..

ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత. మొదటి సాంగ్ రిలీజ్ చేయడానికి దర్శకుడు మారుతీ..

The Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి ఓ హారర్ కామెడీ జోనర్ లో చేస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. మారుతీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడో సైలెంట్ గా షూటింగ్ స్టార్ చేసుకొని చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి.. వింటేజ్ డార్లింగ్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసారు. దీంతో ఈ మూవీ అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఆ అప్డేట్ తరువాత మళ్ళీ మరో అప్డేట్ లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ని ఇవ్వడం కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ ముసిచల్ ప్రమోషన్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారట. సినిమాలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత SKN ఇన్‌డైరెక్ట్ గా ట్వీట్ చేసారు. ఇక ఈ ట్వీట్ కి మారుతీ స్మైల్ సింబల్ తో రిప్లై ఇవ్వడంతో.. అది రాజాసాబ్ ఫస్ట్ సింగల్ అప్డేట్ అని అర్ధమవుతుంది.

Also read : Dwarakish : ప్రముఖ నటుడు మరణం.. స్నేహితుడిని కోల్పోయానంటూ రజినీకాంత్ విచారం..

మరి ఈ అప్డేట్ ని రేపు శ్రీరామనవమి సందర్భంగా ఇవ్వబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ అప్డేట్ తో ప్రభాస్ అభిమానులు సరికొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు