Anupama Parameswaran : ఆ కామెంట్స్‌కి అనుపమ బాగా హర్ట్ అయ్యింది.. మరి అలా చేస్తారా.. సిద్ధూ జొన్నలగడ్డ
ఆ కామెంట్స్‌కి అనుపమ బాగా హర్ట్ అయ్యిందంట. అందుకే సినిమా ట్రైలర్ ఈవెంట్ కి రాకుండా మానేసింది.
- gum 95921
- Published On : March 28, 2024 / 08:35 AM IST
Siddhu Jonnalagadda said Anupama Parameswaran hurt that bad comments
Anupama Parameswaran : సిద్ధూ జొన్నలగడ్డతో అనుపమ పరమేశ్వరన్ చేస్తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. రేపు మార్చి 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చారు. నిన్న మార్చి 27న చిత్ర యూనిట్ మరో ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఈ ట్రైలర్ ని ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేసారు.
అయితే ఈ ఈవెంట్ కి అనుపమ పరమేశ్వరన్ మాత్రం రాలేదు. ఆమె రాకపోవడానికి కారణం సిద్ధూ చెప్పుకొస్తూ.. “ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేసాము. ఆ పోస్టర్ లో అనుపమ హ్యాండ్ పొజిషన్ చూసి బ్యాడ్ కామెంట్స్ చేసారు. వాటికీ అనుపమ బాగా హర్ట్ అయ్యింది. కాబట్టి అమ్మాయిల విషయంలో కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం అలోచించి చేయండి. ఇది ఆర్డర్ అనుకోకండి, రిక్వెస్ట్ అనుకోండి. కామెంట్ చేయడం తప్పు కాదు. కామెంట్ చేస్తే దానిని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలా ఉండాలి” అంటూ సిద్దు చెప్పుకొచ్చారు.
Also read : Ram Charan : ఆడబిడ్డని కాపాడడం కోసం.. చరణ్‌కి అర్ధరాత్రి ఫోన్ చేసి డబ్బులు అడిగా.. మంచు మనోజ్
https://youtu.be/ziLmCfCZ2ks
కాగా ఈ సినిమా విషయంలో అనుపమ చాలానే కామెంట్స్ ఎదుర్కొంటు వస్తున్నారు. తెలుగు అబ్బాయిల్లో చాలామందికి అనుపమ కలల రాణి. పక్కింటి అమ్మాయిలా కనిపించే తనని చూసి ప్రతి అబ్బాయి మనసు పారేసుకున్నారు. కానీ రౌడీ బాయ్ నుంచి అనుపమ ఇంటిమేట్ సీన్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తుండడంతో.. ఫ్యాన్స్ అంగీకరించలేకపోతున్నారు.
టిల్లు స్క్వేర్ నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ లో అనుపమ అందాల ఆరబోస్తూ కనిపిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. ఇతరులు ఏమో ఆమె పై అనేక కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కి అనుపమ కూడా సమాధానం ఇస్తూ వస్తున్నారు. “యాక్టింగ్ అన్నాక ప్రతి పాత్రని పోషించాలి, ఆ పాత్రకి న్యాయం చేసేలా నటించాలి.. అప్పుడే నటిగా నా టాలెంట్ ఏంటో కూడా తెలిసిందే” అంటూ చెప్పుకొచ్చారు. మరి పోస్టర్ అండ్ ట్రైలర్స్ తో అనుపమ పై ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి. రేపు సినిమా రిలీజ్ అయిన తరువాత ఎలా ఉంటుందో చూడాలి.
