Tillu Square : ఎన్టీఆర్ ఇంట్లో ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ పార్టీ.. ఫోటో వైరల్..
ఎన్టీఆర్ ఇంట్లో 'టిల్లు స్క్వేర్' సక్సెస్ పార్టీ సెలబ్రేషన్స్. ఎన్టీఆర్ తో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఉన్న ఫొటోలు..
- gum 95921
- Updated on- April 3, 2024 / 02:54 PM IST
Siddhu Jonnalagadda Vishwak Sen celebrating Tillu Square success at NTR home
Tillu Square : డీజే టిల్లుకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో రూపొందిన ఈ సినిమా.. మార్చి 29న రిలీజయ్యి సూపర్ హిట్టు టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.
మొదటి మూడు రోజుల్లోనే రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఇప్పుడు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిబెడుతూ ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఫస్ట్ వీక్ పూర్తి చేసుకునేపాటికీ 100 కోట్లు మార్క్ ని కూడా అందుకోవడంలో పెద్ద సందేహ పడనవసరం లేదు. ఇక ఈ మూవీ సక్సెస్ చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది.
Also read : Devara : దేవర అప్డేట్ ఇచ్చిన విశ్వక్ సేన్.. దేవర మ్యూజిక్ ఉందమ్మా..
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. జూనియర్ ఎన్టీఆర్ మూవీ టీంకి సక్సెస్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది. లాస్ట్ నైట్ ఎన్టీఆర్ ఇంటిలో నిర్మాత నాగవంశీ, సిద్ధూ జొన్నలగడ్డ, అలాగే విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను వీరి ముగ్గురు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫొటోలు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
కాగా ఈ ఫొటోలు షేర్ చేస్తూ సిద్ధూ జొన్నలగడ్డ.. “బిగ్ సర్‌ప్రైజ్ ఈజ్ కమింగ్” అంటూ కామెంట్ చేశారు. ఇక ఆ సర్‌ప్రైజ్ ఏంటో అని ఎన్టీఆర్ అభిమానుల్లో, టిల్లు గాడి ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలయింది. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
