Oh Na Siddayya : సోనూసూద్ గెస్ట్ గా ఓ నా సిద్ధయ్య సాంగ్ రిలీజ్..

ఈ సాంగ్ ని మీరు కూడా వినేయండి.. (Oh Na Siddayya)

  • Published on- November 1, 2026 / 08:37 AM IST

Oh Na Siddayya

Oh Na Siddayya : సిద్ధు రెడ్డి కందకట్ల, కాత్యాయనీ జగన జంటగా తెరకెక్కిన ప్రైవేట్ ఆల్బమ్, ఎమోషనల్ సాంగ్ ఓ నా సిద్ధయ్య సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. భార్యాభర్తల ప్రేమానుబంధం, పరస్పర అవగాహన, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే తత్వం, ఎదుటి వారికి సాయం చేసే గుణం.. లాంటి మంచి అంశాలను చూపిస్తూ ఈ సాంగ్ ని తెరకెక్కించారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ని తెరకెక్కించారు. సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రలు భార్యాభర్తల అనుబంధం, సేవా కార్యక్రమాలు చేయడం చూపిస్తూ ఈ పాటను తెరకెక్కించారు.

ఈ పాటను రామ్ అద్నాన్ రాయగా కళ్యాణ్ సంగీత దర్శకత్వంలో రామ్ అద్నాన్, శ్రీనిధి పాడారు. ఈ సాంగ్ ని మీరు కూడా వినేయండి..

 

Also Read : Sridhar Gade : SR కళ్యాణమండపం డైరెక్టర్ కొత్త సినిమా అనౌన్స్.. టైటిల్ ఏంటో తెలుసా? గ్లింప్స్ తోనే భయపెట్టారుగా..

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. సినిమా థియేటర్‌లో చూసే అనుభూతిని అవుట్‌డోర్‌‌లోనూ ప్రేక్షకులకు ఇవ్వాలని ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ అవుట్‌డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఈ సాంగ్‌ను రిలీజ్ చేసారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ ఈవెంట్ జరిగింది. వర్షం పడినా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నటుడు సోనూసూద్ గెస్ట్ గా హాజరయి సాంగ్ లాంచ్ చేసారు. ఈ ఈవెంట్ కి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, నటుడు ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

సాంగ్ లాంచ్ అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ.. ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం కొత్తగా ఉంది. ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌ను అభినందిస్తూ పాట మంచి విజయం సాధించాలని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఓ నా సిద్ధయ్య పాట ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు పెద్ద విజయం సాధించాలని అన్నారు.

అలాగే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సినీ పరిశ్రమలో తెరవెనుక పనిచేసే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి హెల్మెట్లు పంపిణీ చేశారు సిద్ధు రెడ్డి.