SIIMA Awards 2026 : సైమా అవార్డ్స్ 2026.. ఉత్త‌మ న‌టుడిగా తేజ స‌జ్జా, న‌టిగా ఐశ్వ‌ర్య రాజేశ్‌..

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా ) 2026 వేడుక (SIIMA Awards 2026) ఘ‌నంగా జ‌రిగింది

SIIMA Awards 2026 Best actor Teja Sajja and winners list

SIIMA Awards 2026 : దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా ) 2026 వేడుక ఘ‌నంగా జ‌రిగింది. బెంగ‌ళూరులోని కోర‌మంగ‌ళ ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు జ‌రిగే ఈ వేడుక‌ల్లో మొద‌టి రోజు ద‌క్షిణాది సినీ తార‌లు సంద‌డి చేశారు. తెలుగు, క‌న్న‌డ‌, మూవీల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అవార్డుల‌ను అందుకున్నారు.

Mrunal Thakur : ఎరుపు డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్‌.. ఫోటోలు వైర‌ల్‌..

ఉత్త‌మ న‌టుడి తేజ స‌జ్జా అవార్డును అందుకున్నాడు. మిరాయ్‌లో న‌ట‌న‌కు గానూ అత‌డు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీలోని న‌ట‌న‌కుగానూ ఐశ్వ‌ర్య రాజేశ్ ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్‌) అవార్డును గెలుచుకుంది. బుల్లిరాజు అలియాస్ భీమ‌ల రేవంత్ సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రంలోని న‌ట‌న‌కు గాను ఉత్త‌మ హాస్య న‌టుడి అవార్డును గెలుచుకున్నాడు.

అవార్డులు అందుకున్న‌ది వీరే..

* ఉత్త‌మ న‌టుడు – తేజ స‌జ్జా (మిరాయ్‌)
* ఉత్త‌మ న‌టి – ఐశ్వ‌ర్య రాజేశ్ (సంక్రాంతికి వ‌స్తున్నాం)
* ఉత్త‌మ హాస్య న‌టుడు – బుల్లిరాజు (సంక్రాంతికి వ‌స్తున్నాం)
* ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు – ర‌మ‌ణ గోగుల (సంక్రాంతికి వ‌స్తున్నాం)
* ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని – స‌మీరా భ‌ర‌ద్వాజ్ (కోర్టు)