Varisu : దళపతి కోసం పాట పాడడమే కాదు కాలు కూడా కలిపిన శింబు.. మాములుగా లేదుగా పాట!
ఇళయ దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వారిసు'. సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే మొదటి సింగల్ 'రంజితమే' సాంగ్ విడుదలయ్యి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. తాజాగా నేడు రెండో సింగల్ ని విడుదల చేశారు మేకర్స్.
- gum 95921
- Published On : December 4, 2022 / 06:38 PM IST
Simbhu for Ilayathalapathy vijay
Varisu : ఇళయ దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే మొదటి సింగల్ ‘రంజితమే’ సాంగ్ విడుదలయ్యి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. తాజాగా నేడు రెండో సింగల్ ని విడుదల చేశారు మేకర్స్.
Varisu: వారసుడు హిందీ టైటిల్ ఏమిటో తెలుసా.. నెట్టింట వైరల్‌గా మారిందిగా!
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని రెండో సింగల్ ని తమిళ స్టార్ హీరో ‘శింబు’ ఆలపించాడు. గతంలో థమన్ పాటలకు గొంతుని సవరించిన శింబు, దళపతి కోసం పాడడం మాత్రం మొదటిసారి. అయితే ఈసారి పాట పాడడమే కాదు.. సాంగ్ ప్రమోషనల్ వీడియోలో అదిరిపోయేలా డాన్స్ చేస్తూ, దళపతి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశాడు. సాంగ్ కూడా పవర్ ఫుల్ గా ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
‘పివిపి సినిమా’ సంస్థతో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రాధికా శరత్ కుమార్, కుష్బూ, సంగీత, జయసుధ, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో మొదటిసారి దిల్ రాజు తమిళ పరిశ్రమంలోకి అడుగుపెడుతున్నాడు. మరి అక్కడ కూడా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటాడేమో చూడాలి.
