Varisu: వారసుడు హిందీ టైటిల్ ఏమిటో తెలుసా.. నెట్టింట వైరల్‌గా మారిందిగా!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ లుక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Varisu: వారసుడు హిందీ టైటిల్ ఏమిటో తెలుసా.. నెట్టింట వైరల్‌గా మారిందిగా!

Vaarisu Hindi Version Title To Be Vaaris

Vaarisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ లుక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Varisu : దిల్ రాజుకి మరో షాక్.. వారసుడు సినిమాకి నోటిసులిచ్చిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, వారిసు చిత్రాన్ని తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వారిసు చిత్రానికి హిందీలో ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

Varisu : తమిళ్, తెలుగు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టిన ‘వరిసు’

కాగా, ఈ సినిమాకు హిందీలో ‘వారిస్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.