Varisu : తమిళ్, తెలుగు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టిన ‘వరిసు’

తమిళ్ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో డబ్బింగ్ చేయనున్నారు. మొదట ఈ సినిమా తెలుగు సినిమా అని చెప్పారు. కానీ తెలుగు సినిమా షూటింగ్స్ ఆపినప్పుడు............

Varisu : తమిళ్, తెలుగు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టిన ‘వరిసు’

clashes between tamil and telugu film industries due to varisu movie

Varisu :  తమిళ్ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో డబ్బింగ్ చేయనున్నారు. మొదట ఈ సినిమా తెలుగు సినిమా అని చెప్పారు. కానీ తెలుగు సినిమా షూటింగ్స్ ఆపినప్పుడు వరిసు ఆపకుండా అది తమిళ్ సినిమా అని దిల్ రాజు చెప్పడంతో వివాదం మొదలైంది. ఇక ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించారు.

ఇటీవల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోటిస్ ఇచ్చింది. గతంలో దిల్ రాజు చెప్పిన మాటలనే ఆధారంగా తీసుకొని పండగల సమయంలో ముందుగా తెలుగు సినిమాలకే థియేటర్స్ ఇవ్వాలి, చివరి ప్రాధాన్యత వేరే భాషా సినిమాలకి ఇవ్వాలని ఓ నోటీసు విడుదల చేశారు. అయితే ఈ నోటీసు ఇండైరెక్ట్ గా దిల్ రాజుకే అని అందరికి తెలుసు. దీనిపై దిల్ రాజు ఇప్పటివరకు స్పందించలేదు కానీ శనివారం జరిగిన ఓ ఈవెంట్ లో అల్లు అరవింద్ దీనిపై స్పందిస్తూ అది జరిగే పని కాదు అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కౌంటర్ ఇచ్చారు.

BiggBoss 6 Day 76 : గీతూ పోయింది.. ఆదిరెడ్డి వంతు.. ఆదిరెడ్డిపై ఫైర్ అయినా నాగార్జున..

తాజాగా ఈ విషయంపై తమిళ దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు. మా తమిళ సినిమాల రిలీజ్ లు తెలుగులో ఆపితే తెలుగు సినిమాలని ఇక్కడ కూడా రిలీజ్ ఆపుతాం. అయినా వరిసు హీరో ఒక్కడే తమిళ్ మిగిలిన క్రూ అంత తెలుగు వాళ్ళే, అది తెలుగు సినిమానే అంటున్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ విడుదల చేసిన నోటీసుపై తమిళ నిర్మాతలు నవంబర్ 22న భేటీ కానున్నారు. మరి ఈ భేటీలో తమిళ నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరి ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుంది? ఎవరు తగ్గుతారు? వరిసు సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేక వాయిదాపడుతుందా చూడాలి. మొత్తానికి దిల్ రాజు వరిసు సినిమా రెండు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టింది.