Vendhu Thaninthathu Kaadu: ఫస్ట్ లుక్‌తో షాకిచ్చిన శింబు-గౌతమ్ మీనన్!
సినిమా అనగానే హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు.. దర్శకుడెవరు.. నిర్మాణ సంస్థ ఏంటి అనేదానిపై కూడా ప్రేక్షకులు సినిమా మీద అంచనా వేసుకుంటారు. అందుకే కొన్ని కాంబినేషన్స్ క్రేజీ కాంబినేషన్స్ గా సినిమా మొదలైన దగ్గర నుండే భారీ హైప్ సొంతం చేసుకుంటుంది. అలాంటి జాబితాలోనిదే.. ‘వెందు తనిందదు కాడు’.
- Naresh Mannam
- Published On : August 7, 2021 / 07:24 PM IST
Vendhu Thaninthathu Kaadu
NVendhu Thaninthathu Kaadu: సినిమా అనగానే హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు.. దర్శకుడెవరు.. నిర్మాణ సంస్థ ఏంటి అనేదానిపై కూడా ప్రేక్షకులు సినిమా మీద అంచనా వేసుకుంటారు. అందుకే కొన్ని కాంబినేషన్స్ క్రేజీ కాంబినేషన్స్ గా సినిమా మొదలైన దగ్గర నుండే భారీ హైప్ సొంతం చేసుకుంటుంది. అలాంటి జాబితాలోనిదే.. ‘వెందు తనిందదు కాడు’. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఓ కన్నేసి ఉంచింది.
ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు దక్షణాది మొత్తం బంపర్ హిట్స్ అయ్యాయి. విన్నైతాండి వరువాయా, అచ్చం ఎంబదు మాదమైదా సినిమాలు మన తెలుగులో ఏ మాయ చేసావే.. సాహసం శ్వాసగా సాగిపో సినిమాలుగా రీమేక్ అయ్యాయి. అయితే.. ఈ రెండు సినిమాలు కూడా అటు శింబును, నాగచైతన్యను స్టైలిష్ లుక్ లో చూపించగా ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమా మాత్రం శింబును షాకింగ్ లుక్ లో మార్చేసింది.
ముందుగా ఈ సినిమాకు ‘నాదిగలై నీరదమ్ సూర్యన్’గా పేరు పెట్టగా దాన్ని ‘వెందు తనిందదు కాడు’గా మార్చేశారు. అంటే దీని అర్ధం కాలిబూడిదైన మనిషి. టైటిల్ కి తగ్గట్లే ఫస్ట్ లుక్ షాకింగ్ గా ఉంది. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ లో శింబు లుంగీ కట్టుకుని, చిరిగిన చొక్కా వేసుకుని, చేతిలో కర్రతో కాస్త వంగి చాలా విచిత్రమైన రూపంలో కనిపిస్తున్నాడు. టైటిల్‌ని జస్టిఫై చేసేలా అతని వెనకాల అడవి తగలబడుతోంది. ఈ ఇంటెన్స్ లుక్ తో ఇదేదో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాగా ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. గతంలో ఈ కాంబినేషన్స్ లో కీలకమైన ఏఆర్ రెహమానే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.
Here’s the title and first look of the new film with @TRSilambarasan @arrahman @IshariKGanesh@VelsFilmIntl
@Ashkum19
Thank you to everybody who made this possible pic.twitter.com/6LY9icJuSd— Gauthamvasudevmenon (@menongautham) August 6, 2021
