Sing Geetham : తెలుగు సినిమాకు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎందుకంటే..?

జూన్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. (Sing Geetham)

  • Published on- June 6, 2026 / 04:20 PM IST

Sing Geetham

Sing Geetham : లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో తెరకెక్కించిన సినిమా ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి.. పలువురు కీలక పాత్రల్లో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.

సింగీతం శ్రీనివాసరావు వయోభారంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ అంతా తన ఇంట్లోనే జరిగింది. షూటింగ్ కూడా వీడియో కాల్ లోనే నాగ్ అశ్విన్ సెట్ లో ఉండి నడిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేసారు. మ్యూజికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది.

Also Read : Sattendru Maaruthu Vaanilai : ‘సత్తెన్ద్రు మారుదు వానిలై’ మూవీ రివ్యూ.. తెలుగులోకి వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్..

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రకటించారు. సింగ్ గీతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో జూన్ 7 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాగనుంది. ఈ ఈవెంట్ కి కమల్ హాసన్ గెస్ట్ గా రాబోతున్నారు. అయితే సింగీతం శ్రీనివాసరావు ప్రస్తుతం చెన్నైలోనే నివసిస్తున్నారు. ఆయన హైదరాబాద్ ట్రావెల్ చేసి రాలేని పరిస్థితి. అందుకే చెన్నైలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు.

సింగీతం శ్రీనివాసరావు తో, ఇటు వైజయంతి మూవీస్ తో మంచి అనుబంధం ఉండటంతో కమల్ హాసన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నారు. చెన్నైలో తెలుగు రిలీజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటంతో ఈ ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరు కానున్నారు. నిర్మాత నాగ్ అశ్విన్, ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ కూడా హాజరు కానున్నారు.