Chinmayi : సమంత పై వచ్చే ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి.. మగజాతి ఆణిముత్యం అని చెప్పుకొనే..

సమంత పై వస్తున్న ట్రోల్స్ పై చిన్మయి గట్టి కౌంటర్ ఇచ్చింది. సుధీర్ఘ వ్యాసంతో సమంత జీవితాన్ని మొత్తం చూపించేసింది.

Singer Chinmayi emotional post on Samantha facing trolls

Chinmayi – Samantha : సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, స్టార్ హీరోయిన్ సమంత మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. తన పై వచ్చే విమర్శలకు సమంత రియాక్ట్ అవ్వకపోయినా చిన్మయి మాత్రం కచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. అంతటి స్నేహం ఉంది ఇద్దరి మధ్య. కాగా సమంత పై ఏదో రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇటీవల ఖుషి (Kushi) మూవీ ప్రమోషన్స్.. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజి పై డాన్స్ వేయడం, మూవీలో లిప్ లాక్ సీన్స్ చేయడం వంటి వాటి పై సమంతని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Kushi : రెండు రోజులోనే అమెరికాలో ఆ రికార్డుని అందుకున్న ఖుషి..

తాజాగా వీటన్నిటి పై చిన్మయి రియాక్ట్ అవుతూ ఒక సుధీర్ఘ వ్యాసం రాసుకొచ్చింది. దానిలో మొత్తం సమంత జీవితాన్ని చూపించేసింది. సమంత ఆరోగ్యం వలన మూవీ షూటింగ్ లేట్ అయ్యిందని, దాని వల్ల నిర్మాత పై బడ్జెట్ భారం పడిందని ఆలోచించి.. తన రెమ్యూనరేషన్ లో కొంతభాగాన్ని వెనక్కి ఇచ్చేసిందట. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎలా ట్రోల్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. “తనని మీరు ఇంతలా నిందిస్తున్నా.. తనకి వచ్చిన ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ మీకు కూడా వస్తే ఏంటని ఆలోచించి. దాని పై మీలో అవగాహనా కల్పించేందుకు ఒక అడుగు ముందుకు వేసి అందరిలో ధైర్యం నింపడానికి ప్రయత్నిస్తున్న సమంతని చూసి నేర్చుకోండి” అంటూ చెప్పుకొచ్చింది.

Bigg Boss 7 : నేటి నుంచే బిగ్‌బాస్ సీజన్ 7.. ఎక్కడ చూడొచ్చు? టైమింగ్స్ ఏంటి?

“తనని ఎవరు ఎన్ని అంటున్నా అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే ముందుకు సాగుతుంది. సమంత పని అయ్యిపోయింది. ఇక ఆమెకు కెరీర్ లేదు అన్న ప్రతిఒక్కరికి.. బాలీవుడ్ అండ్ హాలీవుడ్ తన ముద్ర వేసి బదులిచ్చింది. అలాగే మగజాతి ఆణిముత్యం అని చెప్పుకొనే కొంతమంది.. నిజం గమనించలేక కొన్ని రోజులు నుంచి చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. అలాంటి వారు మీ ఇంటిలో ఉన్నా వారిని దూరంగా పెట్టండి. డబ్బులు సంపాదించాలని ఒకర్ని ఇలా దూషిస్తున్నా, ఏమి మాట్లాడకుండా దూషించే వాళ్లకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి వారి నుంచి తాను కూడా డబ్బు సందించుకునే శాడిస్టిక్ పొజిషన్ లో సమాజం నేడు ఉంది. అయితే కర్మ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎవరది వారికీ ఎప్పుడో అప్పుడు తిరిగి ఇచ్చేస్తుంది” అంటూ వెల్లడిందింది.

ట్రెండింగ్ వార్తలు