Singer Harini Rao : సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్సింగ్.. రైల్వేట్రాక్‌పై తండ్రి మృతదేహం..

సింగర్ హరిణి రావు కుటుంబం అదృశ్యం.. ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు..

Singer Harini Rao

Singer Harini Rao: క్లాసికల్ సింగర్ హరిణి రావు కుటుంబం అదృశ్యం అయిందనే వార్త టాలీవుడ్‌లో కలకలం రేపింది. హరిణి, తల్లిదండ్రులు ఏకే రావు, గిరిజా రావుతో సహా ఆమె కుటుంబం వారం రోజుల నుంచి కనిపించకుండా పోయినట్లు ఎస్‌ఆర్ నగర్‌ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

అసలు ఎందుకు హరిణి రావు కుటుంబం కనిపించకుండా పోయింది. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే విచారణలో పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది.
విచారణ చేపట్టిన పోలీసులకు హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది.

బెంగళూరులోని రైల్వేట్రాక్‌పై ఆయన శవమై కనిపించారు. ఆయనది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి ట్రాక్ మీద పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారికి ఎవరితోనైనా విబేధాలున్నాయా లేక ఆర్థిక ఇబ్బుందలేమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.