Singer Mangli : నాకు ఎలాంటి సంబంధం లేదు.. వారికి న్యాయం చేయండి.. సింగ‌ర్ మంగ్లీ..

మైక్రో ఫైనాన్స్ పేరిట త‌న పేరుతో కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను సింగ‌ర్ మంగ్లీ (Singer Mangli) ఖండించారు.

Singer Mangli says she has no connection with Microfinance traders

Singer Mangli : మైక్రో ఫైనాన్స్ పేరిట త‌న పేరుతో కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను సింగ‌ర్ మంగ్లీ ఖండించారు. ఫైనాన్స్ వ్యాపారుల‌కు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ప్రొఫెన‌ల్ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేష‌న్ వివ‌రాల వ‌ర‌కే గాని, వాళ్ల ప‌ర్స‌న‌ల్ వ్యాపారాల గురించి త‌న‌కు, త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఏ మాత్రం తెలియ‌వ‌న్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.

మైక్రోఫైనాన్స్ పేరిట నా పేరుతో కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తున్నాను. నాకు ఆ వ్య‌క్తుల‌కు, వాళ్ల‌కు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాల‌కు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెష‌న‌ల్ ఈవెంట్స్ కోసం న‌న్ను, నా త‌మ్ముడిని రోజు చాలా మంది సంప్ర‌దిస్తుంటారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేష‌న్ వివ‌రాల వ‌ర‌కే గాని, వాళ్ల ప‌ర్స‌న‌ల్ వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ స‌భ్యుల‌కు ఏ మాత్రం సంబంధం లేని విష‌యం.

Manchu Lakhsmi Daughter : మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్‌లో మోహన్‌బాబు

ఇలాంటి మోస‌పూరిత విష‌యాల్లో నా పేరును వాడుకోవ‌డం, న‌న్ను ఇవ్వాల్వ్ చేయ‌డం చాలా అన్యాయం. కావాల‌ని కొంద‌రు నా వ్య‌క్తిగ‌త పేరు, ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్న క‌రెన్సీకి సంబంధించిన వీడియోల‌కు, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు.

Peddi : ధురంధర్ బాట‌లో పెద్ది..?

నా ప్రొఫెష‌న్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ద‌య‌చేసి నా పేరు చెప్పి ఎవ‌రైనా డ‌బ్బులు వ‌సూలు చేసినా మీరు న‌మ్మ‌వ‌ద్దు. అలా మోస‌పోయిన వారికి న్యాయం చేయాల‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నాను. అని మంగ్లీ తెలిపింది.