Republic: సాయిధరమ్ తేజ్ కెరీర్లో బెస్ట్ సినిమా.. స్టార్ సింగర్ రివ్యూ!
టాలీవుడ్ పాప్ సింగర్ స్మిత రేపు(1 అక్టోబర్ 2021) సాయిధరమ్ తేజ్ హీరోగా విడుదల కాబోతున్న పొలిటికల్ థ్రిల్లర్ సినిమా రిపబ్లిక్ సినిమాకి తన రివ్యూ ఇచ్చేసింది.
- vamsi
- Published on- September 30, 2021 / 09:44 PM IST
Republic Trailer
Republic: టాలీవుడ్ పాప్ సింగర్ స్మిత రేపు(1 అక్టోబర్ 2021) సాయిధరమ్ తేజ్ హీరోగా విడుదల కాబోతున్న పొలిటికల్ థ్రిల్లర్ సినిమా రిపబ్లిక్ సినిమాకి తన రివ్యూ ఇచ్చేసింది. దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాను ముందుగానే స్పెషల్ షో వేసి పలువురు సినీ సెలబ్రిటీలకు చూపించారు.
ఇప్పటికే రిపబ్లిక్ సినిమా చూసిన నాని ‘డైరెక్టర్ దేవాకట్టా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు’ అంటూ కామెట్ చేశారు. ఇదే క్రమంలో స్మిత సైతం రిపబ్లిక్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘రిపబ్లిక్ సినిమా రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమాయని, సాయిధరమ్ తేజ్ కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుందని అన్నారు.
రిపబ్లిక్ సినిమా దేవాకట్టా కొత్త ప్రస్థానమని అన్నారు. సినిమా చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్‌గా అనిపించిందని చెప్పారు. జీ స్టూడియోస్, జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రంలో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటించింది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకు సెలబ్రిటీల నుంచి విషెస్ అందుతున్నాయి.
