Jayant Savarkar : చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. సింగం నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్(Jayant Savarkar) కన్నుమూశారు.
- Thota Vamshi Kumar
- Published On : July 24, 2023 / 04:47 PM IST
Jayant Savarkar
Jayant Savarkar passed away : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్(Jayant Savarkar) కన్నుమూశారు. థానేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆయన ఇక లేరు అన్న విషయాన్ని సావర్కర్ కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ వెల్లడించారు.
Oppenheimer : శృంగార సన్నివేశంలో భగవద్గీత.. మండిపడుతున్న భారతీయులు.. తొలగించకపోతే ఊరుకోం
15 రోజుల క్రితం థానేలో బీపీకి గురికావడంతో తండ్రిని ఆస్పత్రిలో చేర్చినట్లు కౌస్తుభ్ చెప్పాడు. గత రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారన్నారు. అయితే.. కోలుకోలేక ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అని కౌస్తుభ్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
पु. ल. देशपांडे यांनी लिहिलेल्या अनेक व्यक्तिरेखा जयंत सावरकर यांनी इतक्या सुंदररीत्या साकारल्या की आजही त्या व्यक्तिरेखा वाचताना जयंत सावरकर डोळ्यांसमोर येतात. चाळीस वर्षांपेक्षा जास्त काळ त्यांनी मराठी रंगभूमीची सेवा केली. केवळ नाटकांतच नव्हे, तर मराठी, हिंदी चित्रपट आणि टीव्ही… pic.twitter.com/Br5buEn312
— Vinod Tawde (@TawdeVinod) July 24, 2023
Mukku Avinash : కొత్త కారు కొన్న అవినాష్.. మండిపడుతున్న నెటీజన్లు.. ఎందుకంటే..?
జయంత్ సావర్కర్ ఎక్కువగా హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. టెలివిజన్‌లో ఆరు దశాబ్దాల పాటు నటించారు. ‘హరి ఓం విఠల’, ‘గద్బద్ గోంధాల్’, ’66 సదాశివ్’, ‘బకాల్’, ‘యుగ్ పురుష్’, ‘వాస్తవ్’, ‘సింగం’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది మే 21న అంబర్‌నాథ్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ (AMFF)లో జయంత్ సావర్కర్‌కు జీవన్ గౌరవ్ సమ్మాన్ అవార్డు లభించింది. అంతేకాకుండా నట్వర్య ప్రభాకర్ పన్షికర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో కూడా సత్కరించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారైలు, ఓ కుమారుడు ఉన్నారు.
