మందేసి, చిందేసి అగర్వాల్ అక్కాచెల్లెళ్ల హంగామా!
సిస్టర్స్ డే అవుట్ - కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ పార్టీలో ఫుల్ హంగామా చేశారు!

సిస్టర్స్ డే అవుట్ – కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ పార్టీలో ఫుల్ హంగామా చేశారు!
టాలీవుడ్ కథానాయికలు అగర్వాల్ సిస్టర్స్ కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ సిస్టర్స్ డే అవుట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్, నిషా, నిషా భర్త కరణ్ వలేచా కలిసి పార్టీలో ఫుల్లుగా తాగి, చిందులేస్తూ తెగ హంగామా చేశారు.
అక్కాచెల్లెళ్లిద్దరూ హగ్ చేసుకుని ఉండగా కాజల్ చేతిలో బీర్ టిన్ పట్టుకుని ఉంది. మరో ఫోటోలో కాజల్‌ను ఆమె మరిది కరణ్ భుజాలపైకి ఎక్కించుకోగా కాజల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. మరో పిక్‌లో ముగ్గురూ కలిసి మత్తు మొఖాలతో కనిపించారు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2013లో పెళ్లి తర్వాత నిషా సినిమాలు చేయడం ఆపేసింది. కాజల్ విషయానికొస్తే కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ తో పాటు హిందీలో జాన్ అబ్రహాం సరసన ‘ముంబై సాగ’ చిత్రల్లో నటిస్తోంది.