Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?

సితార ఆ జ్యువెల్లరీ ధరించిన ఫోటోలని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రమోషన్ చేశారు. ఈ ఒక్క యాడ్ తోనే సితార ఎక్కడికో వెళ్ళిపోయింది, తండ్రిని మించిపోయింది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Sitara Ghattamaneni Jewellery Ad Remuneration goes viral

Sitara Ad Remuneration :  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ సితార కూడా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ లాగే ఇప్పుడు సితార కూడా యాడ్స్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి పలు సీరియల్ ప్రమోషన్ యాడ్స్ లో కనిపించి అలరించింది సితార. ఇటీవల సింగల్ గా తానే ఒక కమర్షియల్ యాడ్ చేసి ఓ ప్రముఖ జ్యువలరీ బ్రాండ్ కి అంబాసడర్ గా నిలిచింది సితార.

ఇటీవల సితార చేసిన జ్యువెల్లరీ యాడ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. అంతేకాకుండా సితార ఆ జ్యువెల్లరీ ధరించిన ఫోటోలని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రమోషన్ చేశారు. ఈ ఒక్క యాడ్ తోనే సితార ఎక్కడికో వెళ్ళిపోయింది, తండ్రిని మించిపోయింది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ కూడా దీనిపై స్పందిస్తూ తన కూతురిని చూస్తుంటే గర్వంగా ఉందని ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

అయితే ఇప్పుడు సితార ఆ యాడ్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మహేష్ సినిమాలు కాకుండా యాడ్స్ తోనే కోట్లల్లో సంపాదిస్తారు. సితారకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సితారకు ఇది మొదటి కమర్షియల్ యాడ్ అయినా కూడా సితార క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని, అలాగే సితార పేరు మీద సరికొత్త నగల కలెక్షన్స్ కూడా ప్రమోట్ చేసుకొని, ఎక్కువ రోజులు ఈ యాడ్ ప్రమోట్ చేసుకునేలా ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం.

Salaar Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్.. సలార్ కూడా రెండు పార్టులుగా.. సర్‌ప్రైజ్ అదిరిందిగా..

ఇందుకుగాను సితారకు ఏకంగా 70 లక్షల నుంచి దాదాపు ఒక కోటి రూపాయలు చెల్లించినట్టు సమాచారం. దీంతో ఇంత చిన్న ఏజ్ లో మొదటి యాడ్ కే ఈ రేంజ్ రెమ్యునరేషన్ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే ఇలా సంపాదిస్తుంది అంటే అంటే భవిష్యత్తులో ఇంకెన్ని యాడ్స్ చేసి ఎంత సంపాదిస్తుందో, తండ్రిని మించిన కూతురు అవుతుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు