×
Ad

Sivaji : అనసూయ నాకు పరిచయం కూడా లేదు.. తెలిసినవాళ్ళే నా మీద కంప్లైంట్ చేశారు.. శివాజీ కామెంట్స్..

అనసూయ కూడా శివాజీపై తీవ్ర విమర్శలు చేసింది.(Sivaji)

  • Published On : February 23, 2026 / 07:10 PM IST

Sivaji

Sivaji : ఇటీవల కొన్ని రోజుల క్రితం శివాజీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ సినిమా ఈవెంట్ లో హీరోయిన్స్ మంచిగా బట్టలు వేసుకోండి బయటకు వెళ్తే అని చెప్తూ అనుకోకుండా ఓ రెండు అసభ్యకరమైన పదాలు వాడటంతో అది పెద్ద వివాదంగా మారింది. సామాన్యులు, చాలా మంది సెలబ్రిటీలు శివాజీ అనుకోకుండా రెండు పదాలు మాట్లాడినా మంచే కదా చెప్పింది అని సపోర్ట్ చేసినా కొంతమంది మాత్రం శివాజీపై తీవ్ర విమర్శలు చేశారు.(Sivaji)

కొంతమంది అయితే శివాజీపై మహిళా కమిషన్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఆ వివాదంలోకి అనసూయ కూడా ఎంటర్ అయింది. అనసూయ కూడా శివాజీపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ వివాదం అయిపోయినా శివాజీ ఎక్కడ కనిపించినా మొదట ఇదే ప్రశ్న ఎదురవుతుంది. కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇంకా ఈ వివాదాన్ని లాగుతున్నారు.

Also Read : Harish Shankar : పొలిటికల్ కంటెంట్ లేదు.. పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హరీష్ శంకర్..

తాజాగా శివాజీకి ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశ్నలు ఎదురయి అనసూయ గురించి కూడా ప్రస్తావించడంతో శివాజీ మాట్లాడుతూ.. అనుకోకుండా రెండు పదాలు వాడాను. దానికి నేను అప్పుడే క్షమాపణలు కూడా చెప్పాను. ఇంకా లాగొద్దు దాన్ని. నాకు అనసూయ పరిచయం కూడా లేదు. ఆమె ఎప్పుడో గతంలో నాతో ఒక ఇంటర్వ్యూ చేసింది అంతే. అది తప్ప నాకు ఆమెకు ప్రత్యక్షంగా కూడా పరిచయం లేదు. ఎవరూ కావాలని ఆడవాళ్ళని కించపరచాలని, అవమానపరచాలని అనుకోరు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

వుమెన్ కమిషన్ లో నాకు తెలిసినవాళ్ళే నా మీద కంప్లైంట్ చేశారు. అయినా ఆ విషయం ఇంకా మాట్లాడొద్దు అది అయిపొయింది అని అన్నారు. దీంతో శివాజీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై మళ్ళీ అనసూయ ఏమైనా స్పందిస్తుందా చూడాలి.

Also Read : Chiranjeevi Balakrishna : ఏంటి.. నిజంగానే బాలయ్య – చిరు కలుస్తున్నారా? అదే జరిగితే..