Chiranjeevi Balakrishna : ఏంటి.. నిజంగానే బాలయ్య – చిరు కలుస్తున్నారా? అదే జరిగితే..
ఒకప్పుడు చిరు - బాలయ్య ఫ్యాన్స్ బయట రియల్ గా కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. (Chiranjeevi Balakrishna)
Chiranjeevi Balakrishna
Chiranjeevi Balakrishna : చిరంజీవి – బాలకృష్ణ పలు సందర్భాల్లో సినిమా ఈవెంట్స్ లో కలిసి కనిపిస్తారు కానీ బయట కలిసి కనిపించడం తక్కువే. గత కొన్నేళ్లుగా మాత్రం పలు ఈవెంట్స్ లో చిరు – బాలయ్య కలిసి కనిపించి అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నారు. అసలు ఇపుడు ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు చిరు – బాలయ్య ఫ్యాన్స్ బయట రియల్ గా కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ ఇప్పుడు చిరు – బాలయ్య కలిసి కనిపిస్తే పండగే. కొన్ని నెలల క్రితం బాలయ్య 50 ఏళ్ళ సినీ వేడుకకి చిరంజీవి గెస్ట్ గా వచ్చి బాలయ్యని తెగ పొగిడారు. అసలు ఇంద్ర సినిమా వచ్చిందే బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల నుంచి అన్నారు. బాలయ్య – నేను కలిసి నటిస్తాము అలాంటి పవర్ ఫుల్ సినిమా ఎవరైనా రాయండి అని కూడా అన్నారు. బోయపాటికి ఛాలెంజ్ కూడా విసిరారు ఇద్దరినీ పెట్టి సినిమా తీయమని. బాలయ్య కూడా అందుకు ఓకే చెప్పారు.
Also Read : Sivaji : వైసీపీకి సపోర్ట్ చేసే నటీనటులకు ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదా? స్పందించిన శివాజీ.. ఏమన్నాడంటే..?
అయితే ఇప్పుడు ఇది నిజం అవుతుందని టాలీవుడ్ లో రూమర్స్ వస్తున్నాయి. బోయపాటి ఇటీవల ఓ టీవీ ఈవెంట్ కి రాగా చిరంజీవి ఇచ్చిన ఛాలెంజ్ గుర్తుచేశారు. దాంతో అవకాశం ఉంటే చేస్తాను అన్నారు. బోయపాటి అఖండ 2 తర్వాత ఇంకా ఏ సినిమా ప్రకటించలేదు. అటు చిరంజీవి, బాలయ్య మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చిరు ఆల్రెడీ వెంకీతో ఇటీవలే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అని వచ్చి హిట్ కొట్టారు.
దీంతో చిరంజీవి – బాలయ్య ని పెట్టి బోయపాటి సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరో ఒకర్ని మెయిన్ హీరోగా పెట్టి ఇంకొకరిని గెస్ట్ అప్పీరెన్స్ లా పెట్టాలని అనుకుంటున్నారట. బోయపాటితో సినిమా అంటే బాలయ్య ఓకే అంటాడు కాబట్టి బాలయ్య అడిగితే చిరంజీవి ఆ సినిమాలో చేస్తాడని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. ఇదే కనక జరిగి బాలయ్య – చిరు ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ కి పెద్ద పండగే. సినిమా రికార్డులు కూడా బద్దలవ్వాల్సిందే. మరి ఆ కోరిక బోయపాటి తీరుస్తాడా అంటే ఎదురు చూడాల్సిందే.
Also Read : Kiran Abbavaram : వరుస హిట్స్.. కిరణ్ అబ్బవరం రేటు పెంచేసాడా.. ఏకంగా..
