Sivakarthikeyan : శివ కార్తికేయన్‌తో సినిమా అనౌన్స్ చేసిన మురుగదాస్.. ఈసారైనా..!
శివ కార్తికేయన్‌తో సినిమా అనౌన్స్ చేసిన మురుగదాస్. ఏడేళ్ల నుంచి సరైన హిట్ లేని మురుగదాస్ ఈసారైనా..!
- gum 95921
- Published on- February 15, 2024 / 03:10 PM IST
Sivakarthikeyan starts movie with director AR Murugadoss
Sivakarthikeyan : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్.. క్రేజీ సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా ఈ హీరో ‘అయలాన్’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీతో వచ్చి అందర్నీ అలరించారు. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తన కొత్త సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ గత కొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలన్నిటిని నిజం చేస్తూ.. శివ కార్తికేయన్, మురగదాస్ తమ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించేశారు. కాగా సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించి స్టార్ హీరోలు సైతం తన కోసం ఎదురు చూసేలా చేసుకున్న మురగదాస్.. గత కొంతకాలంగా హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. 2020 తరువాత ఈ దర్శకుడు మరో సినిమాని డైరెక్ట్ చేయలేదు.
Also read :Rajendra Prasad : 65ఏళ్ళ వయసులో ఆ హీరోయిన్‍తో.. రాజేంద్ర ప్రసాద్ ప్రేమాయణం..
ఆ ఏడాది రజినీకాంత్ హీరోగా ‘దర్బార్’ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అయితే ఆ చిత్రం అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. ఆ సినిమాకి ముందు విజయ్‌తో ‘సర్కార్’, మహేష్‌తో ‘స్పైడర్’ సినిమాలు చేయగా.. అవి కూడా ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయాయి. సరిగ్గా చెప్పాలంటే.. ఈ దర్శకుడికి ఏడేళ్ల నుంచి చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఇప్పుడు నాలుగేళ్ళ లాంగ్ బ్రేక్ తరువాత శివ కార్తికేయన్ తో సినిమా అనౌన్స్ చేశారు.
ఇది చూస్తుంటే, ఈసారి పక్కా హిట్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రతి సినిమాని సామజిక సమస్య పై తెరకెక్కించే మురగదాస్.. ఈ సినిమాని ఏ కథతో తెరకెక్కించబోతున్నారని ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేయనున్నారు.
