Slum Dog Husband Trailer : కుక్కను పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ కొడుకు.. కోర్టులో విడాకుల పంచాయతీ
'పిట్టకథ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్. దాదాపు మూడేళ్ల విరామం తరువాత రెండో సినిమా 'స్లమ్ డాగ్ హస్బెండ్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : June 29, 2023 / 03:01 PM IST
Slum Dog Husband
Slum Dog Husband : ‘పిట్టకథ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్(Sanjay Rrao). దాదాపు మూడేళ్ల విరామం తరువాత రెండో సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రణవి మానుకొండ హీరోయిన్. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
హీరో, హీరోయిన్లు ప్రేమించుకుంటారు. పెళ్లి కోసం తాపత్రయపడే సీన్లతో ట్రైలర్ ప్రారంభమైంది. వారికి పెళ్లి చేయడానికి పెద్దలు సిద్ధం కాగా.. ఓ గండం ఉందని తెలుస్తుంది. ఆ గండం తొలిగిపోవాలని అబ్బాయి మొదటగా కుక్కను పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత హీరోయిన్ మెడలో తాళి కట్టేసమయానికి ఆపండి అనే సౌండ్ వినిపిస్తుంది. అదెవరో కాదు కుక్క యజమానిది.
Dil Raju Son : దిల్ రాజు రెండో భార్య కొడుకు.. మొదటి సారి బయటకు వచ్చిన ఫొటో.. ఎలా ఉన్నాడో చూశారా?
మొదటి భార్య(కుక్క) బతికి ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావ్ అని ప్రశ్నించడంతో పాటు కేసు పెడతాడు. ఆ తరువాత కుక్క తరుపున లాయర్ సప్తగిరి, హీరో తరుపున లాయర్ బ్రహ్మాజీ కోర్టులో వాదనలు వినిపిస్తారు. ఈ పరిస్థితుల్లో హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తరువాత ఏం జరిగింది తెలియాలంటే జూలై 21 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తంగా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది.
Pop Singer Madonna : ఐసీయూలో అమెరికన్ పాప్ సింగర్.. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఇంటెన్సివ్ కేర్‌లో!
