Dil Raju Son : దిల్ రాజు రెండో భార్య కొడుకు.. మొదటి సారి బయటకు వచ్చిన ఫొటో.. ఎలా ఉన్నాడో చూశారా?

కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. గత సంవత్సరం తేజస్విని ఓ బాబుకి జన్మనిచ్చింది.

Dil Raju Son : దిల్ రాజు రెండో భార్య కొడుకు.. మొదటి సారి బయటకు వచ్చిన ఫొటో.. ఎలా ఉన్నాడో చూశారా?

Dil Raju Second Wife Son Photo goes Viral

Updated On : June 29, 2023 / 2:01 PM IST

Dil Raju :  డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారి విజయం సాధించి ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో మరో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. గత సంవత్సరం తేజస్విని ఓ బాబుకి జన్మనిచ్చింది. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు.

Kamal Haasan : డైరెక్టర్ శంకర్‌కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్.. సినిమా రిలీజ్ అవ్వకుండానే..

బాబు పుట్టినప్పుడు దిల్ రాజు ఎత్తుకున్న ఫొటో వైరల్ అయింది. అప్పటి నుంచి బాబు ఫొటో మళ్ళీ బయటకు రాలేదు. తాజాగా దిల్ రాజు రెండో భార్య కొడుకు ఫొటో వైరల్ గా మారింది. బాబు పుట్టి అప్పుడే సంవత్సరం అయింది. బాబుని టేబుల్ పై నించొని దిల్ రాజు పట్టుకున్నారు. పక్కనే తేజస్విని కూడా ఉంది. బాబు పుట్టిన తర్వాత మొదటిసారి ఫొటో బయటకు రావడంతో వైరల్ గా మారింది.