Samantha : అల్లు అర్జున్ ని చూసి ఏడ్చేసిన స్నేహ రెడ్డి.. వారిని చూసి ఎమోషనల్ అయిన సమంత..

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి బన్నీని పట్టుకుని ముద్దులు పెడుతూ, ఎమోషనల్ అయ్యింది.

Sneha Reddy cried seeing Allu Arjun Samantha got emotional seeing them

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షోలో అభిమాని మృతికి సంబంధించి అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి శనివారం మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశారు. అల్లు అర్జున్ శనివారం ఉదయం జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత అతన్ని చూసి తన కుటుంబ సభ్యులు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు.

Also Read : Vishnu Manchu : మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో.. అల్లు అర్జున్ ని కలిసిన మంచు విష్ణు..

జైలు నుండి ఇంటికి రాగానే ముందు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ బన్నీని గట్టిగా కౌగిలించుకున్నాడు. అనంతరం అతని కొడుకు అయాన్ కూడా వచ్చాడు. ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి బన్నీని పట్టుకుని ముద్దులు పెడుతూ, ఎమోషనల్ అయ్యింది. ఇక అల్లు స్నేహ రెడ్డి ఎమోషనల్ అవ్వడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


కాగా సమంత ఈ వీడియోను రీ షేర్ చేస్తూ.. (తాను కూడా ఎమోషనల్ అవుతూ) “నేను ఏడవడం లేదు, సరేనా!” అని పేర్కొంది. కన్నీటి ఎమోజీలతో, అర్జున్, స్నేహలను ట్యాగ్ చేస్తూ ఓ వీడియో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చెయ్యడంతో వైరల్ గా మారింది. కేవలం సమంతనే కాదు నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఇలా ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీస్ ఈ విషయంపై స్పందించారు.