దుల్కర్‌తో ధూళిపాళ

దుల్కర్ సల్మాన్, శోభిత ధూళిపాళ జంటగా.. శ్రీనాథ్ రాజుంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రైమ్ ధ్రిల్లర్.. ‘కురుప్‌’..

  • Publish Date - September 20, 2019 / 05:55 AM IST

దుల్కర్ సల్మాన్, శోభిత ధూళిపాళ జంటగా.. శ్రీనాథ్ రాజుంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రైమ్ ధ్రిల్లర్.. ‘కురుప్‌’..

సినిమా సినిమాకు నటుడిగా తనని తాను మరింతగా ప్రూవ్ చేసుకుంటూ.. విజయవంతంగా కెరీర్ రన్ చేస్తున్నాడు దుల్కర్‌ సల్మాన్‌.. ఇప్పుడు మరో మలయాళ సినిమా చెయ్యబోతున్నాడు. దుల్కర్, శోభితా ధూళిపాళ జంటగా.. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వంలో ‘కురుప్‌’ అనే సినిమా రూపొందనుంది.

1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్‌ సుకుమార కురుప్‌. అతని జీవితం ఆధారంగా ‘కురుప్‌’ తెరకెక్కుతోంది. సుకుమార కురుప్‌ పాత్రలో దుల్కర్‌ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్‌ ప్రారంభం అయింది. శోభిత ఫస్ట్ టైమ్ దుల్కర్‌తో జతకడుతుంది.

Read Also : హిందీలో హిట్టయ్యింది!

మలయాళంలో ఆమెకిది  రెండో సినిమా.. ఇంతకుముందు నివీన్‌ పౌలీతో నటించిన ‘మూతాన్‌’ రిలీజ్‌కు రెడీ అవుతుంది. దుల్కర్ నటించిన హిందీ మూవీ ‘ది జోయా ఫ్యాక్టర్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.