Sonakshi Sinha : సోనాక్షి సిన్హా బాయ్‌ఫ్రెండ్ ఇతనేనా.. ‘ఐ లవ్ యు’ అంటూ పోస్ట్..
సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. జహీర్, సోనాక్షి కలిసి డబల్ XL సినిమాలో నటించారు. అలాగే ఇద్దరూ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేశారు.
- Saketh U
- Published On : June 3, 2023 / 03:52 PM IST
Sonakshi Sinha Rumoured Boyfriend Zaheer Iqbal Posted I LOVE YOU in social media with birthday post
Zaheer Iqbal : శత్రుఘన్ సిన్హా(Shatrughan Sinha) కూతురిగా బాలీవుడ్(Bollywood) లోకి ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. దబాన్, రౌడీ రాథోర్, దబాంగ్ 2, భుజ్, దబాంగ్ 3.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సోనాక్షి. చివరిసారిగా సోనాక్షి డబల్ XL అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం పలు హిందీ సినిమాలు చేస్తోంది.
సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. జహీర్, సోనాక్షి కలిసి డబల్ XL సినిమాలో నటించారు. అలాగే ఇద్దరూ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేశారు. జహీర్ కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. వీరిద్దరిమధ్య స్నేహం ఏర్పడి అనంతరం రిలేషన్ లోకి వెళ్లారని, ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఇద్దరూ స్పందించలేదు.
తాజాగా జూన్ 2న సోనాక్షి సిన్హా పుట్టిన రోజు కావడంతో జహీర్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. సోనాక్షితో చాలా క్లోజ్ గా కలిసి దిగిన ఫోటోలను జహీర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నువ్వు ఎప్పుడూ నాపై ఆధారపడొచ్చు, నువ్వు ఎప్పుడూ సక్సెస్ సాధిస్తూ ఉండాలి. ఎవరూ చూడని ప్రపంచాన్ని నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఐ లవ్ యు అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ కి సోనాక్షి లవ్ ఎమోజిలను రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Samantha : ఆ సిరీస్ లో ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత.. నిజమేనా? సమంత ఏమంది?
డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ఐ లవ్ యు అని పోస్ట్ చేయడంతో ఇన్నాళ్లు డౌట్ గా ఉన్న వీరి రిలేషన్ నిజమేనా అని అనుకుంటున్నారు అంతా. మరోసారి సోనాక్షి బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ అంటూ బాలీవుడ్ లో వైరల్ గా మారింది. మరి ఇప్పటికైనా వీరిద్దరూ స్పందిస్తారేమో చూడాలి.
