Soniya Singh : 40 నుంచి 50 లక్షలు ఇస్తామన్నారు.. బెట్టింగ్ ప్రమోషన్స్ పై సోనియా కామెంట్స్ వైరల్..

బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన చాలా మంది నటీనటులకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చి విచారణ చేసారు. (Soniya Singh)

  • Published on- July 5, 2026 / 06:20 PM IST

Soniya Singh

Soniya Singh : సీరియల్స్, యూట్యూబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంది. ఓ పక్క సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే టీవీ షోలు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీగా ఉంది సోనియా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనియా బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి కామెంట్స్ చేసింది.

కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ ప్రమోషన్స్, దానిపై కేసులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన చాలా మంది నటీనటులకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చి విచారణ చేసారు.

Also Read : Soniya Singh : పెళ్లి కాకుండా కలిసి ఉంటున్నామని మా అమ్మని తిట్టారు.. మా పెళ్లి ఎప్పుడంటే..?

తాజాగా నటి సోనియా సింగ్ మాట్లాడుతూ.. నేను బెట్టింగ్ ప్రమోషన్స్ చేయలేదు. కారు కొన్నాను కానీ అవన్నీ కస్టపడి సంపాదించిన డబ్బులే. అయినా అది EMI లోనే కొన్నాను. నాకు బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే 40 నుంచి 50 లక్షలు ఇస్తామని అఫర్ చేసారు. అంత డబ్బులు వస్తున్నప్పుడు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటారు. ఆ బెట్టింగ్ ప్రమోషన్ చూసి ఆడాలా వద్దా అనేది చూసే వాళ్ళ ఇష్టం. చాలా యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ చూసి కొనాలా వద్దా అనేది మన ఇష్టం. కానీ అంత డబ్బులు చిన్న ప్రమోషన్ కి ఇస్తున్నారంటే ఏదో తప్పు ఉంది అని నేనే ఆగిపోయాను. అందుకే ఆ ప్రమోషన్స్ చేయలేదు. ఈజీ మనీని ఎప్పుడూ నమ్మకూడదు అని తెలిపింది.