Soniya Singh : పెళ్లి కాకుండా కలిసి ఉంటున్నామని మా అమ్మని తిట్టారు.. మా పెళ్లి ఎప్పుడంటే..?
సోనియా - సిద్దు ఇద్దరూ కూడా కరోనా సమయం నుంచి లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్నట్టు వాళ్ళే తెలిపారు. (Soniya Singh)
- Saketh U
- Published on- July 5, 2026 / 05:54 PM IST
Soniya Singh
Soniya Singh : యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లలో క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది సోనియా. సిద్దు పవన్ అనే మరో నటుడితో ప్రేమలో ఉన్న సోనియా తనతో కలిసి రెగ్యులర్ గా టీవీ షోలలో కనిపిస్తూ, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
సోనియా – సిద్దు ఇద్దరూ కూడా కరోనా సమయం నుంచి లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్నట్టు వాళ్ళే తెలిపారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Anshula Kapoor : జాన్వీ కపూర్ అక్క.. అన్షులా కపూర్ పెళ్లి.. మెహందీ వేడుకలు.. ఫొటోలు..
సోనియా మాట్లాడుతూ.. మాది ఆల్మోస్ట్ ఆరేళ్ళ రిలేషన్. మేమిద్దరం పెళ్లి కాకుండా ఉంటున్నామని తెలిసి కొంతమంది మా అమ్మని తిట్టేవాళ్ళు. మా అమ్మ మమ్మల్ని అడిగేది. మా అమ్మ నేను, సిద్దు విడిపోతే ఏంటి పరిస్థితి అని భయపడేది. అవన్నీ సమాజంలోని మనుషులు మా అమ్మ మీద పెట్టినవి. అలా అడిగే వాళ్ళింట్లో కూతురు ఉంటుంది కానీ ఆమె గురించి పట్టించుకోరు. నా మీద ఫోకస్ పెట్టి అడుగుతారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాము. సెప్టెంబర్ 2న తెల్లవారుజామున 1.45 కి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము మేము అని అది ఏ సంవత్సరమో చెప్పలేము అని తెలిపింది.
దీంతో ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 సిద్దు – సోనియా పెళ్లి చేసుకుంటారు అని, ముహూర్తం కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
