ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ : అత్యంత విషమంగా ఆరోగ్యం..
- sekhar
- Published On : September 24, 2020 / 07:02 PM IST
SPB Health Bulletin: కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది.
కరోనా నుంచి కొలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో బాలు పరిస్థితి విషమంగా మారింది. తాజాగా ఎంజిఎం వైద్యులు బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
‘గత 24 గంటలకు బాలు ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి విషయంగానే ఉంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందిస్తున్నాం’ అని ఎంజీఎం హెల్త్ కేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధ భాస్కరన్ తెలియచేశారు.
కాగా స్వల్ప కరోనా లక్షణాలతో ఆగస్టు 5న హాస్పిటల్ లో చేరారు బాలు.
ఆగస్టు 13న పరిస్థితి విషమంగా వుండడంతో ICU కు తరలించి వెంటిలేషన్ పై ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్సనందిస్తున్నారు. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు.
