బాలు అంత్యక్రియలకు హాజరైన దళపతి విజయ్

  • Publish Date - September 26, 2020 / 01:47 PM IST

SPB Last Rites: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ హాజరయ్యారు. బాలు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు.

బాలుతో విజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ‘ప్రియామనవాలే’ అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సూపర్ హిట్ చిత్రంలో బాలు, విజయ్ తండ్రీ కొడుకులుగా నటించారు.

బాలు అంత్యక్రియలు ఆయనకు అత్యంత ఇష్టమైన, ఆయన సంతోషంగా గడిపిన తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌ (ఫా‌మ్‌హౌస్‌) లో జరిగాయి. బాధాతప్త హృదయాలతో బాలు పార్థివ దేహాన్ని ఖననం చేశారు. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కన్నీటిపర్యంతమవుతూ బాలుకు తుది వీడ్కోలు పలికారు.