SP Charan : ‘లవ్ యువర్ ఫాదర్’.. మళ్ళీ నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న సింగర్..

కొన్నేళ్ల క్రితం నుంచి నటుడిగా సినిమాలకు దూరంగా ఉన్న SP చరణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఓ కొత్త సినిమాని ప్రకటించారు.

SP Charan Re entry in Movies as Actor With Love Your Father LYF Movie

SP Charan : SP బాలసుబ్రహ్మణ్యం కొడుకుగా SP చరణ్ అందరికి పరిచయమే. సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలని అందించారు SP చరణ్. చరణ్ గతంలో నటుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు తీశారు. ప్రస్తుతం సింగర్ గా, పాడుతా తీయగా ప్రోగ్రాం హోస్ట్ గా బిజీగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి నటుడిగా సినిమాలకు దూరంగా ఉన్న SP చరణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఓ కొత్త సినిమాని ప్రకటించారు.

శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ యువర్ ఫాదర్(LYF). ఈ సినిమాలో SP చరణ్ హీరో తండ్రి పాత్రలో చాలా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు నిర్మించిన మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా మళ్ళీ ఈ సినిమా నిర్మిస్తుంది. తాజాగా ఈ LYF సినిమా మూవీ పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ గా జరిగింది. మల్లారెడ్డి కాలేజీలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ మాట్లాడుతూ.. 1983 నుంచి ఇప్పటివరకు మనిషా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు లవ్ యువర్ ఫాదర్ అనే ఒక మంచి తండ్రి కొడుకుల ఎమోషన్ ఉన్న కథతో రాబోతున్నాం. ఎనిమిది నెలలు కష్టపడి స్క్రిప్ట్ తయారుచేశాం. మణిశర్మ గారు మా సినిమాకి సంగీతం అందిస్తున్నారు. దేవుడు తర్వాత దేవుడు తర్వాత తండ్రి. ఈ లవ్ మై ఫాదర్ సినిమాకు మా నాన్నగారి బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయి అని తెలిపారు.

ఇక ఈ సినిమా దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ.. గతంలో కో డైరెక్టర్ గా చాలా సినిమాలకు పని చేశాను. కిషోర్ రాఠీ గారు నన్ను స్వయంగా పిలిచి ఈ సినిమా ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఈ మనీషా ఫిలిమ్స్ బ్యానర్లో నా మొదటి సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది. కిషోర్ రాఠీ గారి లైఫ్ లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ని తీసుకుని ఈ కథని తండ్రి కొడుకుల బంధంగా రాసుకున్నాం అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు