OG 2 : ఫ్యాన్స్‌కు పండ‌గే .. ఓజీ2 నుంచి స్పెష‌ల్ వీడియో..

ఓజీ2 (OG 2 ) నుంచి స్పెష‌ల్ వీడియోను విడుద‌ల చేశారు.

Special video from Pawan kalyan OG2

OG 2 : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా ఓజీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంద‌ని ఓజీ మూవీ చివ‌ర్లో వెల్ల‌డించారు. తాజాగా ఓజీ2కు సంబంధించిన ప‌నులు ప్రారంభ‌మైన‌ట్లు తెలుపుతూ వీడియోను విడుద‌ల చేశారు.

‘తుఫాను రాక‌ముందు ముందు ఓ క్ష‌ణం పాటు నిశ్చ‌బ్దం ఉంటుంది. ‘గంభీర’కు సంబంధించిన చెప్పబడని కథ ఆవిష్కృతమయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఓజీ యూనివ‌ర్స్ గాథ‌ను విస్త‌రించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుజీత్.. ప‌వ‌న్‌తో మ‌రోసారి జ‌త క‌డుతున్నారు.’ అంటూ చిత్ర బృందం రాసుకొచ్చింది.

NBK 112 Pooja Ceremony : బాల‌య్య 112 మూవీ పూజా కార్య‌క్ర‌మం.. ఫోటోలు..

ఈ వీడియోలో ప‌వ‌న్‌కు ద‌ర్శ‌కుడు సుజీత్ క‌థ‌ను వివ‌రిస్తున్నారు. ఇక సుజీత్ చెప్పిన క‌థ‌కు ప‌వ‌న్ ఇంప్రెస్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అతి త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించే అవ‌కాశం ఉంది.