Sridhar Gade : SR కళ్యాణమండపం డైరెక్టర్ కొత్త సినిమా అనౌన్స్.. టైటిల్ ఏంటో తెలుసా? గ్లింప్స్ తోనే భయపెట్టారుగా..

శ్రీధర్ గాదె దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు. (Sridhar Gade)

  • Published on- November 1, 2026 / 08:21 AM IST

Sridhar Gade

Sridhar Gade : ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో కిరణ్ అబ్బవరం కెరీర్ ఆరంభంలో మంచి హిట్ ఇచ్చాడు దర్శకుడు శ్రీధర్ గాదె. లవ్ స్టోరీ, నాన్న ఎమోషన్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మాణంలో శ్రీధర్ గాదె దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు.

కమిటీ కుర్రోళ్లు ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నేడు టైటిల్ అనౌన్స్ చేస్తూ ఆసక్తికర గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘కొరివి’ అనే ఆసక్తికర టైటిల్ అనౌన్స్ చేసారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్.. పలువురు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ప్రస్తుతం కొరివి సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

Also Read : Trigun : బిగ్‌బాస్ త్రిగుణ్ కొత్త సినిమా అనౌన్స్‌..

డైరెక్టర్ శ్రీధర్ గాదె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ కొరివి అని అనౌన్స్ చేస్తూ ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ హారర్ వైబ్ ఇచ్చింది. మాయా నది ప్రాంతంలో ఉన్న నిధికి కాపు కాసే ఓ కొరివి ఆ దెయ్యం కథగా ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. అలాగే కొంత మేకింగ్ విజువల్స్ కూడా ఈ గ్లింప్స్ లో చూపించారు. దీంతో ఈ హారర్ సినిమాపై ఆసక్తి నెలకొంది.

కొరివి గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..