Nandamuri Heroes: ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ముగ్గురూ కలిసి యాక్ట్ చేసిన సినిమా తెలుసా? అప్పట్లోనే సెన్సేషన్

నందమూరి హీరోలు(Nandamuri Heroes) ముగ్గురు కలిసి నటించిన ఏకైన సినిమా సంచలనం క్రియేట్ చేసింది.

Sr. NTR, Balakrishna, and Jr. NTR acted together in Brahmarshi Vishwamitra movie

  • మూడు తరాల నందమూరి సినిమా.
  • ఎన్టీఆర్, బాలయ్య, తారక్ రచ్చ.
  • ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ అరుదైన రికార్డు.

Nandamuri Heroes: తెలుగు సినీ చరిత్రలో నందమూరి వంశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కుటుంబం నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తరువాత బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని అలా మైంటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ, ఈ ముగ్గురు(Nandamuri Heroes) కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. తెలుగు సినీ చరిత్రలో మరపురాని చిత్రం కావడం ఖాయం కదా. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్ర హీరోలు కలిసి ఒకే తెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

Supritha: చీరకట్టులో సుప్రీత సింగారం.. అందమే ఆసూయపడేలా ఉందిగా.. ఫొటోలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు, నందమూరి బాలకృష్ణ, నేటి గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ ముగ్గురూ కలిసి నటించిన ఏకైక అద్భుత దృశ్యకావ్యం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రం అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించింది. ఒకే ఫ్రేమ్‌లో నందమూరి మూడు తరాల నటులను చూడటం నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండగలా నిలిచింది.

ఈ సినిమాలో పాత్రల విభజన కూడా ఎంతో అద్భుతంగా కుదిరింది. ఎన్టీఆర్ టైటిల్ రోల్ అయిన విశ్వామిత్రుడిగా విశ్వరూపం చూపించగా.. బాలకృష్ణ దుష్యంతుడి పాత్రలో అదరగొట్టారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, బాలయ్య ఈ చిత్రంలో హరిశ్చంద్రుడిగా కూడా మరో పవర్‌ఫుల్ పాత్రను పోషించి మెప్పించారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా, బాలనటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ‘భరతుడి’ క్యారెక్టర్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిన్న వయసులోనే తారక్ పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేసాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఈ స్థాయి స్టార్ స్టేటస్‌కు చేరుకోవడానికి ఆనాటి భరతుడి పాత్రే గట్టి పునాది వేసిందని చెప్పవచ్చు.

ఈ చారిత్రాత్మక చిత్రం గురించి నందమూరి హీరోలు ఇప్పటికీ ఎంతో గర్వంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. తన నటనకు ఆద్యుడైన తాతగారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలో మరువలేని అదృష్టమని జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే మహోన్నత నటుడైన నాన్నగారి దర్శకత్వంలో, ఆయనతో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లవుతున్నా, ఇప్పటికీ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రతిసారీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. తెలుగు సినిమా ఉన్నంతవరకు నిలిచిపోయే ఒక అరుదైన మైలురాయి ఈ చిత్రం.