Vishal : విశాల్‌నే పెళ్లి చేసుకుంటా అంటూ యాంకర్.. సిగ్గుతో ఇబ్బందిపడిన హీరో..

విశాల్‌నే పెళ్లి చేసుకుంటా అంటూ స్టేజి పై యాంకర్ చెప్పిన మాటలకు సిగ్గుతో ఇబ్బందిపడిన హీరో.

Vishal : విశాల్ నటించిన కొత్త సినిమా ‘రత్నం’ వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ అవుతుండడంతో.. విశాల్ తెలుగులో కూడా వరుస ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో విశాల్‌కి.. ఓ లవ్లీ సంఘటన ఎదురైంది.

ఈ ప్రెస్ ని ప్రముఖ యాంకర్ స్రవంతి చొకారపు హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్ ని స్టార్ట్ చేసేటప్పుడు స్రవంతి తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటనని అందరితో పంచుకున్నారు. స్రవంతి మాట్లాడుతూ.. “విశాల్ గారు మీతో ఒక విషయం పంచుకోవాలని ఉంది. మీ పందెం కోడి సినిమా చూసినప్పుడు నేను మా అమ్మతో చెప్పనంటా.. నేను పెళ్లి చేసుకుంటే ఈయన్నే చేసుకుంటా అని. అలా చెప్పిన నేను ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి లోపల సీతాకోక చిలకుల ఎగురుతున్నాయి. గతం ఎన్ని ఈవెంట్స్ చేసిన ఇలాంటి ఫీలింగ్ కలగలేదు” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Nabha Natesh : ‘డార్లింగ్’ మూవీ ఈవెంట్‌లో.. నభా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి.. బాధపెట్టిన ప్రియదర్శి..

ఇక ఈ మాటలకు స్టేజి కింద ఉన్న విశాల్ సిగ్గుతో నవ్వుకుంటూ ఇబ్బంది పడ్డారు. కాగా విశాల్ కి ఇంకా పెళ్లి కాలేదు అన్న విషయం అందరికి తెలిసిందే. విశాల్ పెళ్లి కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కానీ విశాల్ మాత్రం పెళ్లి మాట తీసుకు వస్తుంటే.. ప్రభాస్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకున్నా తరువాత నేను చేసుకుంటా అని చెబుతూ వస్తున్నారు.

రత్నం విషయానికి వస్తే.. భరణి, పూజ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత విశాల్ మరోసారి దర్శకుడు హరితో కలిసి చేస్తున్న సినిమా ఇది. ప్రియా భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు