×
Ad

Vishnu Vinyasam : ‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ.. శ్రీవిష్ణు మళ్ళీ ఫుల్ గా నవ్వించాడుగా.. క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఊహించారు..

శ్రీవిష్ణు సినిమా అంటే ఫుల్ గా నవ్విస్తారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. (Vishnu Vinyasam)

  • Published On : February 27, 2026 / 02:37 PM IST

Vishnu Vinyasam

Vishnu Vinyasam : శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా తెరకెక్కిన సినిమా ‘విష్ణు విన్యాసం’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మాణంలో యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విష్ణు విన్యాసం సినిమా నేడు ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల అయింది.

కథ విషయానికొస్తే..

విష్ణు(శ్రీవిష్ణు)కి వాస్తు, జాతకాలు.. ఇలాంటివి అన్ని పిచ్చి. అతని గురువు OC (శ్రీనివాస్ రెడ్డి) చెప్పిందే ఫాలో అవుతాడు. విష్ణు ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుంటాడు. మనీష(నయన్ సారిక) జాతకంలో ఓ దోషం ఉండటంతో ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాదు. ఈ విషయంలో మనీషా చాలా బాధపడుతుంది. మనీషా విష్ణు చేసే కాలేజీలో లెక్చరర్ గా చేరుతుంది. విష్ణుని కావాలని తనకు జూనియర్ గా అసిస్ట్ చేయించుకుంటుంది. మనీష మొదటి రోజే విష్ణుతో ప్రేమ ప్రయాణం మొదలుపెడుతుంది.

మొదట విష్ణు ఆశ్చర్యపోయినా ఆమె నంబర్లు, జాతకం ఇతనికి కలుస్తుందని OC గురువు చెప్పడంతో ఇతను కూడా ప్రేమిస్తాడు. ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డాక మనీషా తన జాతకం విషయం శ్రీ విష్ణుకి చెప్తుంది. దాంతో విష్ణు షాక్ అవుతాడు. మరి జాతకం విషయం తెలిసిన విష్ణు మనీషని పెళ్లి చేసుకుంటాడా? అసలు మనీషా జాతకంలో ఉన్న దోషం ఏంటి? వీరిద్దరి ప్రేమకథ ఎలా నడిచింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Anand Deverakonda : నాకు వదిన అంటూ.. రష్మిక గురించి స్పెషల్ పోస్ట్ చేసిన ఆనంద్ దేవరకొండ..

సినిమా విశ్లేషణ..

శ్రీవిష్ణు సినిమా అంటే ఫుల్ గా నవ్విస్తారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా కూడా కామెడీ ఎంటెర్టైనర్ గానే తెరకెక్కించి చివర్లో ఎమోషన్ ని పండించారు. మనీష బాధతో ఓపెన్ అయిన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శ్రీ విష్ణు వాస్తు, జాతకాల పిచ్చి, సత్య – శ్రీవిష్ణు కామెడీ, మనీష పరిచయం ఆమెతో విష్ణు ప్రేమాయణంతో మొత్తం కామెడీగానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ గా నవ్వుకుంటారు. ఇంటర్వెల్ కి మనీష తన జాతక దోషం చెప్పడంతో విష్ణు షాక్ అవుతాడు. దాంతో నెక్స్ట్ విష్ణు ఏం చేస్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ లో ఆ జాతకదోషం తెలిసాక విష్ణు ఏం చేస్తాడు అని కాసేపు కామెడీగా నడిపించినా చివరి అరగంట ఎమోషనల్ గా మారింది. సెకండ్ హాఫ్ లో పెళ్లి రిలేటెడ్ సీన్స్ బాగా సాగదీశారు. హీరోకి ఫ్లాష్ కట్స్ కోసం రిపీటెడ్ సీన్స్ చాలా సార్లు వాడారు. దీంతో సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఊహించడం కష్టమే. వాస్తు, జాతకాలు, మూఢ నమ్మకాల విషయంలో డైరెక్ట్ గా చెప్పకపోయినా ఓ మెసేజ్ అయితే ఇచ్చారు. ఎప్పట్లాగే శ్రీ విష్ణు సినిమా నవ్వుకోడానికి వెళ్లొచ్చు. పాత పాటలు, వేరే హీరోల రిఫరెన్స్ లు బాగానే వాడారు. ఈ సినిమా నిడివి 2 గంటలే కావడం ప్లస్ అయింది. సినిమా హీరో శ్రీవిష్ణు అయిన కథ మాత్రం హీరోయిన్‌ది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

శ్రీవిష్ణు తన గత సినిమాల్లో లాగే తనకు అచ్చొచ్చిన స్టైల్, మేనరిజంతో ఈ సినిమాలో కూడా ఫుల్ గా నవ్వించే ప్రయత్నం చేసాడు. నయన్ సారిక అక్కడక్కడా నవ్విస్తూనే ఎమోషల్ సీన్స్ లో మెప్పించింది. సత్య కూడా తన కామెడీతో ఫుల్ గా నవ్విస్తాడు. బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, గిరి.. అక్కడక్కడా నవ్వించారు. శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, మురళి శర్మ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also See : Singers Shivani Charan Wedding : పెళ్లి చేసుకున్న సింగర్స్.. ఫోటోలు వైరల్..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే కలర్ ఫుల్ గా బాగున్నాయి. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ లో కొంత కట్ చేస్తే బెటర్. పాత కథే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో కామెడీ ఎంటర్టైనర్ గా నవ్వించడానికి తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘విష్ణు విన్యాసం’ సినిమా శ్రీవిష్ణు మార్క్ కామెడీతో నవ్వుకోడానికి చూసేయొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.